టీవల ప్రముఖుల ఇళ్లను పేల్చేస్తామని, హోటల్లో బాంబు ఉందని భయపట్టే కాల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, మెగాస్టార్స్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలకు చెందిన ముంబై బంగ్లాలను పేల్చివేస్తామని నాగ్‌పూర్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు.
MLA Saroj Ahire: మహారాష్ట్ర మహిళా ఎమ్మెల్యే చంటి బిడ్డతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యే సరోజ్ అహిరే తన నాలుగు నెలల బిడ్డతో ముంబైలోని మహారాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సోమవారం నుంచి మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్ర థానే జిల్లాలోని ముంబ్రా సబర్బన్ ప్రాంతంలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్దవ్ ఠాక్రే పార్టీ, పార్టీ గుర్తను కోల్పోవడంపై తనకు సానుభూతి లేదని ఆయన అన్నారు. ముంబ్రా ఎందుకు ఉనికిలోకి వచ్చింది.. ముంబై నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చే బలవంతం చేసింది ఎవరు..? టాడా కింద ప్రజలను జైళ్లలోకి నెట్టిన రోజులను తాను మరిచిపోలేదని అసద్ అన్నారు. ఎన్సీపికి చెందిన అజిత్ పవార్, సుప్రియా సూలే నాయకులు…
Asaduddin Owaisi : ఉస్మానాబాద్‌ను ధరశివ్‌గా, ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి.
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు వరుసగా ఛత్రపతి శంభాజీ నగర్, ధరాశివ్‌గా మార్చబడ్డాయి. శుక్రవారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించింది.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న కారు మూడు పల్టీలు కొట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, ఒకరు గాయపడినట్లు అధికారి తెలిపారు.
Sanjay Raut Claims Threat To Life: ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపనలు చేశారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. లోక్ సభ ఎంపీ శ్రీకాంత్ షిండే(ఏక్ నాథ్ షిండే కుమారుడు) నన్ను చంపేందుకు థానేకు చెందిన నేరస్థుడు రాజా ఠాకూర్‌కు సుపారీ ఇచ్చాడని..బాధ్యత కలిగిన పౌరుడిగా మీకు తెలియజేస్తున్నా అని పోలీసులకు లేఖ రాశారు. అయితే సంజయ్ రౌత్ ఆరోపనలను…
Sanjay Raut: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ను కోల్పోవడంపై ఉద్దవ్ ఠాక్రే వర్గం నాయకుడు ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం న్యాయం కాదని.. వ్యాపారం ఒప్పందం అని దీని కోసం ఏకంగా 6 నెలల్లో రూ. 2000 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఆరోపించారు. రూ. 2000 కోట్ల కేవలం ప్రాథమిక అంచనా అని.. ఇది వందశాతం నిజమని, అధికార పక్షానికి దగ్గరగా ఉండే ఓ బిల్డర్ ఈ విషయాలను…
Uddav Thackeray: శివసేన పార్టీని, విల్లు-బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్దవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అయితే ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పోరాడుతామని ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే శనివారం తన వర్గం నేతలు, కార్యకర్తలతో ఉద్దవ్ ఠాక్రే సమావేశం అయ్యారు. ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీకి బానిసగా…
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. శివసేన పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం విల్లు-బాణం గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందుతాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి, శివసేన మాజీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తాకినట్లు అయింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏక్ నాథ్ షిండేను ‘ మారలేని ద్రోహి’గా అభివర్ణించాడు. వారు శివసేన చిహ్నాన్ని దొంగలించారని..…