దేశంలో కరోనా మరోసారి పగడ విప్పింది. రోజువారీ కేసులు వందల సంఖ్య నుంచి వేలకు చేరింది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. మహారాష్ట్రలో ఈ రోజు 711 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులిని చంపి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నించిన ఆరుగురు వ్యక్తుల అంతర్ రాష్ట్ర ముఠాను మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పట్టుకున్నారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Carona : దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 562 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివిటీ రేటు 9.4 శాతానికి చేరిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ముంబయిలో ముగ్గురు యువతీ యువకులు కలిసి ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను చూసిన ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. తనకు మొబైల్ టెక్ట్స్ సందేశాల ద్వారా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ఆయన తెలిపారు.
Ram Navami violence: శ్రీరామ నవమి రోజు ఆరు రాష్ట్రాల్లో హింసాకాండ జరిగింది. శ్రీరాముడి ఊరేగింపు సమయంలో రెండు వర్గాల వారు ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడం, రాళ్లు రువ్వడం వంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. మహరాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్ లో మరొకరు మరణించారు. మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను భవిష్యత్ లో సీఎంగా చూడాలని మహారాష్టలోని పుణెకు చెందిన ఓ ఐస్ క్రీం వ్యాపారి ఆశ పడుతున్నాడు. అంతేకాకుండా సచిన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని వినూత్నంగా ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు.
వేడివేడిగా ఉన్న పెనంపై కూర్చుని భక్తులను బాబా ఆశీర్వదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంత్ గురుదాస్ మహరాజ్గా గుర్తించబడిన ఈ బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గోసంరక్షణ సంస్థలను నడుపుతున్నాడు.
Maharashtra: దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. మృగాళ్లు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా ఆడపిల్ల కనబడితే కామాంధులు రెచ్చిపోతున్నారు. నిర్భయ, దిశ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా కూడా రేపిస్టులు భయపడటం లేదు. ప్రతీ రోజు ఎక్కడో చోట అత్యాచార ఉదంతం బయటకు వస్తూనే ఉంది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.