Maharastra: ఆన్లైన్ గేమ్ల పేరుతో రోజుకో కొత్త కేసులు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వార్తలు నిత్యం వస్తున్నా.. కానీ ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రానున్న ఐదు రోజుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు పడతాయని భారత వాతావరణశాఖ పేర్కొంది.
Telangana-and-Maharashtra: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని జిల్లాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కుండపోత వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కుండపోత వర్షాలు పడటంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రాష్ట్రంలోని పలు చోట్ల రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో NH44పై నిన్నటి (శనివారం) నుంచి వెహికిల్ రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకా పరిసరాల్లో కొంతకాలంగా పులి సంచరస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురి అవుతున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే, గురువారంనాడు ఉదయం మూల్ తాలూకాలోని ఎస్గావ్ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై పులి దాడికి యత్నించిందని.. చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు తిరగడంతో త్రుటిలో అతడికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
Landslide: మహారాష్ట్రలోని రాయగఢ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి జరిగిన ఈ పెను ప్రమాదంలో 30కి పైగా కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయ్యాయని భయాందోళన చెందుతున్నారు.
CM KCR: మహారాష్ట్రలో బీఆర్ఎస్ను మరింత విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బీఆర్ ఎస్ శాఖలు ఏర్పాటైనప్పటికీ.. మహారాష్ట్రపైనే ఎక్కువగా దృష్టి సారించింది.
బీజేపీ-శివసేన కూటమితో ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక, అజిత్ పవార్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు.. తాను కోరుకున్న ఆర్థిక శాఖను ఆయన దక్కించుకున్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు నేడు కొత్త శాఖలు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో అజిత్ వర్గానికి మంచి ప్రాధాన్యత ఉన్న శాఖలే వచ్చాయి.
Maharashtra Woman Getting Tomatoes As A Birthday Gift: మధ్యతరగతి కుటుంబ వంట గదిలో ‘టమోటా’దే రాజ్యం. ప్రతి వంటలోనూ టమోటా హస్తం ఉండాల్సిందే. అప్పుడే ఆ కూరకు రుచి వస్తుంది. టమోటా కూర, టమోటా రసం, టమోటా చట్నీ, టమోటా జ్యూస్.. ఇందులో ఏదో ఒకటి ప్రతి ఇంట్లో ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఏ వంటకంలో అయినా టమాట ముక్కకి వాటా ఉంటుంది. కిలో టమోటా రూ. 20 లేదా 30కి దొరకడం…