ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందినదిగా తెలుస్తుంది. ఈ వీడియోలో స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సు డ్రైవర్ ఒక చేతిలో గొడుగు పట్టుకుని మరో చేత్తో స్టీరింగ్ తిప్పుతూ.. బస్సును నడిపిస్తుండటం మనం చూడొచ్చు. బస్సు టాప్ నుంచి వర్షం నీరు కారుతున్నదని గ్రహించి.. ఆ డ్రైవర్ ఇలా గొడుగు పట్టుకున్నాడు. అయితే, ప్రభుత్వ బస్సుల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తడం కొత్తమీ కాదు.. ఇంతకు ముందు కూడా ఇలాంటి వీడియోలు నెట్టింట చక్కర్లు చాలానే కొట్టాయి.
Read Also: World Cup 2023: వన్డే వరల్డ్ కప్ కు టీమిండియా జట్టు ఇదే..!
కాగా, ఈ లేటెస్ట్ వీడియో సోషల్ మీడియా వేదికలన్నింటిలోనూ తెగ వైరల్ అయితుంది. నెటిజన్స్ ఈ వీడియోను విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో డ్రైవర్ వర్షం పడుతున్న టైంలో గొడుగు పట్టుకుని బస్సును నడపుతున్నాడు. ఈ వీడియో మహారాష్ట్ర రవాణా వ్యవస్థ స్థితిగతులను తెలియజేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఇలా చేయడం వల్ల డ్రైవర్ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read Also: Flexi War in Khammam: అమిత్ షా సభలో ప్లెక్సీ వార్… ఈటల వర్గీయులు వార్నింగ్ ?
మహారాష్ట్ర రోడ్డు రవాణ సంస్థపై సోషల్ మీడియాలో విమర్శల పర్వం కొనసాగుతుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించకూండా.. ఇలాంటి డొక్కు బస్సులను నడిపి ఆదాయం పొందాలని చూస్తున్నారని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా కొత్త బస్సులను కొనుగోలు చేసి.. ప్రయాణికులకు, డ్రైవర్లకు అండగా ఉండాలని తెలిపారు.
यह वीडियो गढ़चिरौली के अहेरी का है !
बारिश होने पर बस की छत टपकने से यह बात सामने आई है कि ड्राइवर बस में छाता लेकर बस चला रहा था!
यह हालत होगई है महाराष्ट्र के @msrtcofficial बस सेवा की, यात्रियों की सुरक्षा अब उपरवाले के भरोसे है!
वीडियो: @mumbaitak #Maharashtra #Gadchiroli pic.twitter.com/z5evosrfk6— Mumbai Congress (@INCMumbai) August 25, 2023