లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ప్రకారం, ఆగస్టు 1న పుణెలో ప్రధాని నరేంద్ర మోదీ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందుకోనున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ఈ కార్యక్రమానికి హాజరవుతుండగా.. అజిత్ పవార్ కూడా హాజరవుతారు.
ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనేక కుట్రలు చేస్తుందని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. అందుకోసమే.. ఇతర పార్టీల్లో చీలికలు సృష్టిస్తోంది.. యూనిఫాం సివిల్ కోడ్ వంటి అంశాలను తెరపైకి తీసుకువస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో సొంతంగా గెలుస్తామనే నమ్మకం లేనందునే అలా చేస్తోందని ఉద్ధవ్ థాక్రే విమర్శించారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్దవ్ థాక్రే బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి మహా వికాస్…
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలను అమలు చేస్తున్నా కూడా లైంగిక దాడులు తగ్గడం లేదు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అని చూడకుండా లైంగిక దాడి చేస్తున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి.. తాజాగా మహారాష్ట్రలో దారుణమైన ఘటన వెలుగు…
CM KCR: సీఎం కేసీఆర్ మహరాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీని ఆ రాష్ట్రంలో బలోపేతం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల్లోని జిల్లాల్లో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరిగాయి.
గత కొంతకాలంగా మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ( శనివారం) మహారాష్ట్రకు చెందిన బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ స్వయంగా కండువా కప్పి వారికి సాదర స్వాగతం పలికారు.
అజిత్ పవార్ తనపై చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ శనివారం బదులిచ్చారు. సోదరుడి కుమారుడైన అజిత్ పవార్పై విరుచుకుపడ్డారు. 'రిటైర్' అవ్వాలని అజిత్ పవార్ చేసిన సూచన మేరకు.. తాను అలసిపోనని, రిటైర్మెంట్ తీసుకోనని, తనలో ఇంకా ఫైర్ అలాగే మిగిలి ఉందని అన్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగుతున్న నేపథ్యంలో తాను మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే ఖండించారు. రాష్ట్రంలోని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, మాట్లాడేందుకు భయపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
Buldhana Bus Accident: మహారాష్ట్రలోని బుల్దానాలో జరిగిన బస్సు ప్రమాదంపై విచారణలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణలో తేలింది.
Richest Beggar: బిచ్చమెత్తుకుంటూ రూ. 7.5 కోట్లు సంపాదించాడు ఓ వ్యక్తి. ప్రపంచంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన బిచ్చగాళ్ల జాబితాలో చేరారు. నెలకు రూ. 60 వేల నుంచి రూ.75 వేల వరకు సంపదిస్తూ ఈ ఖ్యాతి గడించాడు. అతను ఎవరో కాదు మన దేశానికి చెందిన భరత్ జైన్.
Uddhav Thackeray: మహరాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కొన్నాళ్లుగా మహారాష్ట్రలో శివసేన అంశంపై రాజకీయాలు నడుస్తుంటే.. తాజాగా ఎన్సీపీలో చీలిక తాజా అంశంగా మారింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కి షాక్ ఇస్తూ అజిత్ పవార్ అసమ్మతి గళమెత్తాడు.