Thieves Break ATM Only To Find No Cash Inside at Maharashtra: ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ఏటీఎం)లోని డబ్బును చోరీ చేసేందుకు యత్నించిన దొంగలకు ఊహించని షాక్ తగిలింది. డబ్బు కోసం ఏటీఎంను ధ్వంసం చేసి చూడగా.. అందులో నగదు లేకపోవడంతో దొంగలు అవాక్కయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఓ జాతీయ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మానేర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మానేర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… పాల్ఘర్ తాలూకాలోని మాస్వాన్ గ్రామంలోని జాతీయ బ్యాంకు కియోస్క్ ఏటీఎం వద్దకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు శనివారం తెల్లవారుజామున 2 గంటలకు వెళ్లారు. ముందుగా సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఆపై ఏటీఎంను పగలగొట్టి చూడగా.. అందులో డబ్బు షాక్ తిన్నారు. ఇక చేసేది లేక నిరాశగా అక్కడినుంచి వెళ్లిపోయారు.
Also Read: Gold Today Price: మహిళలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే?
ఏటీఎం మెషిన్‌కు మరమ్మతు పనులు జరుగుతున్నందున అందులో కొన్ని రోజులుగా డబ్బు ఉంచలేదట. ఈ విషయం తెలియని దొంగలు చోరీకి యత్నించారు. ఈ ఘనపై మానేర్ పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితులు ఎవరో ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.