Maharashtra: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతుంది. వర్షంలో తడవకుండా ఉండటం కోసం చాలా మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే మన దేశంలో చాలా చోట్ల ప్రభుత్వ బస్సులు అస్తవస్త్యంగా ఉన్నాయి. ఎప్పటి బస్సులనో ఇప్పటి వరకు కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని డ్రైవ్ చేయడం డ్రైవర్ లకు చాలా కష్టంగా మారుతుంది. దాని వల్ల ప్రయాణికులు కూడా నానా కష్టాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు జరుగుతున్నా చాలా రాష్ట్రాలలో బస్సులను ఇలాగే లాగించేస్తున్నారు. ఆ బస్సులు ఎత్తులు ఎక్కలేక ఆగిపోవడం తరువాత జనాలు తోయడంతో ముందుకు కదలడం చాలా సందర్భాల్లోనే చూశాం.
Also Read: Sonia Gandhi: వీడియో: శ్రీనగర్ లో సోనియా గాంధీ బోట్ రైడ్
ఇక తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో డ్రైవర్ గొడుగు పట్టుకొని బస్సు నడుపుతున్నాడు. ఇది మహారాష్ట్రకు చెందిన బస్సు. బస్సు వెళుతున్నప్పుడు వర్షం పడింది. బస్సు పాతది కావడంతో బస్సులోకి అక్కడక్కడ పై నుంచి వాన నీరు కారింది. డ్రైవర్ వద్ద కూడా నీరు లీక్ కావడంతో చేసేది లేక అతను ఒక చేతిలో గొడుగు పట్టుకొని మరో చేతితో స్టీరింగ్ తిప్పుతూ బస్సును నడిపాడు. ఇది చూస్తే చాలా భయంగా అనిపిస్తుంది. ప్రయాణీకులు కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్లే ప్రమాదాలు జరుగుతాయని, బస్సులో ఉన్న అందరి ప్రాణాలు ఆపదలో పడతాయని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మహారాష్ట్ర బస్సుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. అది పల్లెటూరికి వెళ్లే బస్సు అందుకే దాని గురించి పట్టించుకోవడం లేదంటూ మరొకరు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది అంబ్రెల్లా డ్రైవింగ్ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి డ్రైవింగ్ ప్రమాదకరమని ఇది చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. డ్రైవర్ దుస్థితిపై ప్రతి ఒక్కరు జాలి చూపిస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయి అయ్యిండి ఇలా కష్టపడుతున్నాడని , ప్రభుత్వం ఇప్పటికైనా బస్సుల పరిస్థితిని పాటించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
#VIDEO: महाराष्ट्र के गढ़चिरौली में बारिश के दौरान टपकती बस में चालक ने छाता पकड़कर की ड्राइविंग.. वीडियो #VIRAL #Maharashtra #TNNCard #Gadchiroli pic.twitter.com/jWSFqBzj2S
— Times Now Navbharat (@TNNavbharat) August 25, 2023