మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ గందరగోళం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక తర్వాత జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఢిల్లీలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎనిమిది తీర్మానాలను ఆమోదించారు. ఇందులో అజిత్ పవార్ సహా 9 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శరద్ పవార్‌ను కలిశారు.
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జాతీయ పార్టీలో చేరిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్థానంలో ఉండవచ్చని ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం అన్నారు.
NCP Crisis: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) రాజకీయంలో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్ గా వ్యవహారం నడుస్తోంది. ఎన్సీపీ పార్టీలో అజిత్ పవార్ చీలిక తీసుకువచ్చారు. అజిత్ పవార్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు షాక్ ఇస్తూ.. బీజేపీ-షిండే ప్రభుత్వంలో చేరారు. ఆయన ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు మరో 8మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రభుత్వంలో చేరారు.
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికీ బంగారం అంటే ఇష్టం.. అదే స్థాయిలో బైక్స్ అన్నా ఇష్టం.. తన ఇష్టాలను మొత్తం కలగలిపి సరికొత్తగా బైక్ ను డిజైన్ చేయించుకుని అందరినీ ఆకర్షించాడు. పూణేలోని పింప్రీ-చించ్వాడ్ కి చెందిన సన్నీ వాఘురే అనే వ్యక్తి తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌ను గోల్డెన్ బుల్లెట్‌గా మార్చేసుకున్నాడు. టర్న్ ఇండికేటర్స్, హెడ్‌ల్యాంప్ కవర్, నంబర్ ప్లేట్, ఫ్రంట్ ఫోర్క్ కవర్, ఫుట్‌రెస్ట్‌లు, క్లచ్, లివర్, ఓడోమీటర్ అన్నీ గోల్డెన్ కలర్ లోకి…
Modi Govt Cabinet Expansion: లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రివర్గంలో పలు మార్పులకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో మోడీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో పలువురు మంత్రుల పేర్లు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాష్ట్ర మంత్రివర్గంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య ప్రాథమికంగా 200కి చేరుకోవడంతో గత 51 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒక ప్రత్యేక దృశ్యం ఆవిష్కృతమైంది.
ఒకప్పుడు రైతులు సంప్రదాయ పంటలను పండించేవారు.. కానీ ఇప్పుడు అదాయాన్ని ఇచ్చే పంటలను పండిస్తున్నాయి.. ముఖ్యంగా పూలతో అదిరిపోయే లాభాల ను పొండుతున్నారు.. కొందరు సాగులో సరైన పద్ధతులు పాటించి పంటలు వేస్తే మరికొందరు మాత్రం సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలను పండిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వివిధ రకాల పంటల ను పండిస్తున్నారు.. అందులోను పూల మొక్కలను ఎక్కువగా పండిస్తున్నారు.. అక్కడి పంట పొలాలని బట్టి కేవలం సంప్రదాయ పంటలని మాత్రమే పండించే వాళ్ళు. ఈ పంటల…
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్‌గా లోక్‌సభ ఎంపీ సునీల్ తట్కరేను అజిత్ పవార్ వర్గం సోమవారం నియమించింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఆదివారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనందుకు ముగ్గురు పార్టీ నేతలను తొలగించారు.