దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికల నేపథ్యంలో మొత్తం ఏడు విడతలలో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే లోకసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిన సంఘటన ఇదివరకే మనకు వేదితమే. ఇకపోతే తొలి దశ లోకసభ ఎన్నికల సమయం దగ్గర పడింది. మొదటి విడతలో భాగంగా ఎన్నికలు జరగబోయే ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. నేటి సాయంత్రం ఐదు గంటలకు స్పీకర్లు, మైకులను ఇక ఆపేయాల్సిందే.
Also Read: Ram Mandir : అయోధ్యకు భక్తుల వరద.. రాంలాల అలంకారం, సూర్య తిలకం.. ఈ రోజు చాలా స్పెషల్
మొదటి విడతలో భాగంగా 102 లోకసభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. మొదటి విడుదల భాగంగా మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాలతో పాటు.. పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షదీప్ కేంద్రపాంత ప్రాంతాల్లో కూడా మొదటి దశ పోలింగ్ ను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇక ఆయా ప్రాంతాలకు సంబంధించి బందోబస్తు చేసేందుకు ఇప్పటికే కేంద్ర పోలీసు బలగాలు చేరుకున్నాయి.
Also Read: Jos Buttler Century: జోస్ బట్లర్ సూపర్ సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు!
ఇక దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతాయి అన్న విషయానికి వస్తే.. మహారాష్ట్రలోని రామ్ టెక్, నాగ్ పూర్, గడ్చిరౌలి, బందారా గోండియా, చంద్రాపూర్, చిముర్ స్థానాలకు , వెస్ట్ బెంగాల్ లోని కుచ్ బిహార్, జల్పైగురి, అలీపుర్ దౌర్స్ లోక్ సభ స్థానాలకు, యూపీలోని షహరాన్ పూర్, కైరానా, ముజఫర్ నగర్, నగినా, బిజనూర్, పిల్ బిత్, మొరాదాబాద్, రామ్ పూర్ స్థానాలకు., ఉత్తరాఖండ్ లో 5 లోక్ సభ స్థానాలకు, ఇక ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ లో 2, మణిపూర్ లో 2, మేఘాలయలో 2, మిజోరాంలో 1, నాగాలాండ్ లో 1, సిక్కిం, త్రిపుర, ఛత్తీస్ గఢ్, జమ్ము-కశ్మీర్ లలో ఒక్కో లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.