Devendra Fadnavis: నెహ్రూ, కాంగ్రెస్ ఎన్నడూ శివాజీ మహారాజ్‌ని గౌరవించలేదు..
- శివాజీ విగ్రహం చుట్టూ మహారాష్ట్ర రాజకీయాలు..
- సింధుదుర్గ్‌లో కూలిపోయిన శివాజీ మహారాజ్ విగ్రహం..
- నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ కూటమి నిరసన..
- కాంగ్రెస్..నెహ్రూ శివాజీని ఎన్నడూ గౌరవించలేదన్న ఫడ్నవీస్..
- ఈ అంశంపై రాజకీయాలు మానుకోవాలన్న డిప్యూటీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం శివాజీ మహారాజ్ విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం కూలిపోవడంపై ఏక్‌నాథ్ షిండే-బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)ల సర్కార్ ‘మహాయుతి’పై విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ( కాంగ్రెస్- ఉద్ధవ్ ఠాక్రే- ఎన్సీపీ శరద్ పవార్)ల కూటమి విరుచుకుపడుతోంది. ఈ రోజు ఎంవీఏ కూటమి ఆందోళనలకు పిలుపునిచ్చింది. విగ్రహం కూలిపోవడంపై ప్రభుత్వాన్ని నిందిస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రతిపక్ష పార్టీల రాజకీయాలపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కానీ ఎంవీఏ నాయకులు ఎన్నడూ శివాజీ మహారాజ్‌ని గౌరవించలేదని అన్నారు. ఈ ఆందోళనలు పూర్తిగా రాజకీయమని నెహ్రూ జీ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని డిస్కవరీ ఆఫ్ ఇండియాలో అవమానించారని ఎత్తిచూపారు. కాంగ్రెస్, ఎంవీఏ దీనికి క్షమాపణలు చెబుతాయా..? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సీఎం కమల్ నాథ్ శివాజీ విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చేశారని, స్వతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ శివజీ సూరత్‌ని దోచుకున్నారని బోధించారని, వీటికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? అని అడిగారు.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
Read Also: Crime: 13 ఏళ్ల బాలికపై స్కూల్ ప్యూన్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి దారుణం..
ఈ ఘటనను రాజకీయం చేయడం సరికాదని ఎన్సీపీ(అజిత్ పవార్) ప్రధాన కార్యదర్శి, ఎంపీ సునీల్ తట్కరే ఫడ్నవీస్‌కి మద్దతు తెలిపారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) దీన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు ఈ ఘటనకు క్షమాపణలు చెప్పారు. కాబట్టి దీనిని రాజకీయం చేయడం మానుకోవాలని హితవు చెప్పారు.
ఎంపీఏ కూటమి ఆందోళనల నేపథ్యంలో ముంబై పోలీసులు మరింత సిబ్బందిని మోహరించారు. ఎంవీఏ నేతల మార్చ్ చర్చ్‌గేట్ స్టేషన్ సమీపంలోని హుటాత్మా చౌక్ నుంచి ప్రారంభమై గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ముగుస్తుంది. ఆగస్టు 26న సింధుదుర్గ్ జిల్లాలోని శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంతో ఈ అంశం రాజకీయంగా మారింది. కొద్ది నెలల క్రితమే ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. విగ్రహం కూలిపోయిన అంశంపై ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పారు.
తాజావార్తలు
-
OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
-
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
-
OTR: టీడీపీ-జనసేనలో మేయర్ సీటు పంచాయితీ? ఏలూరులో హాట్ పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!