Crime: మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. బర్త్ డే పార్టీలో 22 ఏళ్ల యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ కూడా ఉందని శుక్రవారం పోలీసులు తెలిపారు. బద్లాపూర్‌లోని షిర్‌గావ్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో బుధ, గురువారాల మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: AP and Telangana: తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్ల కేంద్ర సాయంలో బిగ్ ట్విస్ట్..! అది వట్టిదే..
ఫిర్యాదు ఆధారంగా నిందితులు సంతోష్ శివరూమ్ రూపావతే(40), శివం సంజయ్ రాజే(23), అలిస్కా అలియాస్ భూమిక రవీంద్ర మేష్రామ్(20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలిస్కా తన పుట్టినరోజు వేడుక కోసం బాధిత యువతిని తన ఇంటికి ఆహ్వానించింది. మిగిలిన ఇద్దరు నిందితులు అప్పటికే అక్కడ ఉన్నారు. పార్టీ ముగిసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించడం ప్రారంభించారు. బాధిత యువతి ఇంటికి వెళ్లే సమయంలో నిందితులు నిమ్మరసం అందించారు.
నిమ్మరసంలో మత్తు మందు కలిపినట్లు యువతి ఆరోపించింది. డ్రింక్ తాగిన తర్వాత తాను అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు చెప్పింది. నిందితుల్లో ఒకరు తనపై బాత్ రూపంలో అత్యాచారానికి పాల్పడి అక్కడే వదిలి వెళ్లినట్లుగా చెప్పింది. నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64 (అత్యాచారం) మరియు 123 (నేరం చేసే ఉద్దేశ్యంతో విషం ద్వారా గాయపరచడం మొదలైనవి) మరియు ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.