మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జాల్నా జిల్లాలో బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 17 మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర రవాణా సంస్థ బస్సు గేవ్రాయ్ నుంచి జాల్నాకు వెళ్తుండగా అంబాద్ నుంచి నారింజ పండ్లతో వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ ఓవర్‌టేక్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.
ఇది కూడా చదవండి: Pailam Pilaga Review: పైలం పిలగా రివ్యూ
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని.. స్థానికుల సహాయంతో పోలీసులు క్షతగాత్రులను రక్షించి అంబాద్, జాల్నాలోని ఆసుపత్రులకు తరలించారు. బస్సు అద్దాలు పగులగొట్టి చాలా మంది క్షతగాత్రులను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: EY CA Death Case: “సీనియర్ ఉద్యోగి ఫ్రెషర్స్‌ని లైంగికంగా వేధించాడు”.. EY ఘటన నేపథ్యంలో టీసీఎస్ ఉద్యోగి సంచలన ఆరోపణ..