Ambulance Blast: అంబులెన్స్‌కు మంటలు.. తృటిలో తప్పించుకున్న గర్భిణి
- మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో.
- అంబులెన్స్‌లో మంటలు
- తృటిలో తప్పించుకున్న గర్భిణి, కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambulance Blast: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఓ గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు తృటిలో బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గర్భిణిని, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జల్గావ్ జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా దాదా వాడి ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన జరిగింది. ఉన్నటుండి అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Also Read: Atrocious Case: ఐదేళ్ల కూతురిపై మృగంలా దాడి చేసిన తాగుబోతు తండ్రి.. మరణశిక్ష విధించిన కోర్టు
Also Read
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- Hyderabad: హైదరాబాద్‌లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
అంబులెన్స్‌లో మంటలు చెలరేగినట్లు గుర్తించిన వెంటనే డ్రైవర్ అంబులెన్స్‌పై నుంచి కిందకు దూకాడు. గర్భిణిని, కుటుంబసభ్యులను కూడా వెంటనే బయటకు తీశారు. కొద్ది నిమిషాల తర్వాత అంబులెన్స్ లోని ఆక్సిజన్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి సమీపంలోని కొన్ని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి. అంబులెన్స్‌లో మంటలు పెద్దెత్తున వ్యాపించాయి. దీంతో కొన్ని అడుగుల ఎత్తులో నిప్పురవ్వలు వెలువడ్డాయి. కొద్దిసేపటికే అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. అలాగే ఈ ఘటనతో హైవేపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Also Read: GAIL Recruitment 2024: గెయిల్ ఇండియాలో 261 పోస్టులు ఖాళీలు.. లక్షల్లో జీతం
#Breaking | Ambulance carrying pregnant woman blasts after catching fire in Maharashtra's #Jalgaon
Notably, no one was reported hurt as the driver's alertness made him notice the smoke coming out from vehicle, leading to quick evacuation of those on board.
More details awaited.… pic.twitter.com/sh0YMA59tn
— Jamililer (@JamilKhabir396) November 13, 2024
తాజావార్తలు
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్‌గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!