Maharashtra: బీజేపీ మాజీ మహిళా ఎంపీపై దాడి.. కుర్చీలు విసురుతూ.. దుర్భాషలాడుతూ(వీడియో)
- మరి కొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
- ఎన్నికల ప్రచారంలో భాగంగా దరియాపూర్‌లోని ఖల్లార్ గ్రామానికి వెళ్లిన మాజీ ఎంపీ
- సభలో గందరగోళం
- ఎంపీ నవనీత్ రాణాపై దాడికి యత్నించిన పలువురు వ్యక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీ, బీజేపీ నేత నవనీత్ రాణా ర్యాలీలో ప్రసంగించేందుకు అమరావతిలోని దరియాపూర్‌లోని ఖల్లార్ గ్రామానికి చేరుకున్నారు. ఆమె వేదికపై ప్రసంగం ముగించి కిందకు రాగానే కొందరు ఆమెపై కుర్చీలు విసిరేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ ప్రచార సభలో పెద్ద దుమారమే రేగింది. తనపై కూడా కుర్చీలు విసిరినట్లు మాజీ ఎంపీ నవనీత్ రాణా ఆరోపించారు. తృటిలో తప్పించుకున్నారని నవనీత్ రాణా పేర్కొన్నారు. దీనిపై ఆమె ఖల్లార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేయకుంటే హిందువులంతా తరలివచ్చి నిరసన తెలపాలని ఆమె కోరారు. యువ స్వాభిమాన్ పార్టీ అభ్యర్థి రమేష్ బండిలే ప్రచారానికి సంబంధించిన బహిరంగ సభ నిర్వహించారు. ఆయనకు మద్దతుగా ప్రచారానికి నవనీత్ రానా వచ్చారు.
READ MORE: Darshi : ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ టీజర్ డేట్ ఇదే..
Also Read
- Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
- Arnab Cyclone Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు..
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
- AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
“నాపై కుర్చీలు విసిరారు, దుర్వినియోగం చేశారు”
ఈ విషయంపై నవనీత్ రానా మాట్లాడుతూ.. “నన్ను చూసిన తర్వాత కొంత మంది వ్యక్తులు నాతో అనుచితంగా ప్రవర్తించారు. నా పోలీసు సెక్యూరిటీ గార్డులను కూడా కొట్టారు. వారు నన్ను కొట్టేందుకు యత్నించారు. వారు నాపై కుర్చీలు విసిరారు. నా కులాన్ని ప్రస్తావిస్తూ.. నన్ను దూషించాడు. నా మీద ఉమ్మి వేయడానికి ప్రయత్నించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయకపోతే అమరావతి జిల్లాలో మొత్తం హిందూ సమాజం ఈ ప్రదేశంలో నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుంది.” అని ఆమె తెలిపారు.
𝔸𝕄ℝ𝔸𝕍𝔸𝕋𝕀 | BJP leader and former MP Navneet Rana was attacked during her rally in Amravati, Maharashtra. Fortunately, she escaped unharmed. During her speech, she was subjected to lewd gestures and offensive slogans, including "Allahu Akbar." The crowd then began throwing… pic.twitter.com/MLIxl8GzB6
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) November 17, 2024
తాజావార్తలు
-
Srinidhi Shetty : రూట్ మార్చిన ‘ఆదర్శ కుటుంబం’.. త్రివిక్రమ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
-
Rashmika Mandanna : “అవును.. అతనంటే నాకు పిచ్చి!” : ట్రోలర్లకు రష్మిక ఘాటు సమాధానం.. ఫెమినిజం ముసుగులో వేధింపులంటూ ఫైర్!
-
Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు..
-
Chandra Kumar Bose: “చరిత్రను వక్రీకరించడం నేరం”.. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!