కరోనా ఫస్ట్ వేవ్‌తో పాటు సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలమే సృష్టించింది.. అయితే, భారత్‌లో ఎక్కువగా ఇబ్బంది పడింది.. ఎక్కువ కేసులు వెలుగు చూసింది మాత్రం మహారాష్ట్రలోనే.. ఇక, ఆ రాష్ట్ర రాజధాని ముంబైలోనే పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అవుతూ వచ్చాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దీంతో.. మహారాష్ట్రతో పాటు ముంబైలో అక్టోబర్ 4 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. మొదట.. 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించింది.. అక్టోబర్ 4 నుండి ముంబైలో 8 నుంచి 12 వ తరగతి వరకు స్కూళ్లను పునర్ ప్రారంభిస్తామని.. మిగతా తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులపై నవంబర్‌లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.. కోవిడ్ -19 మార్గదర్శకాలను అనుసరిస్తూ స్కూళ్లను నడపనున్నట్టు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చాహల్ తెలిపారు. అయితే, ఈ విషయంపై ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.. అక్టోబర్ 4 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 5-12 తరగతులకు, అర్బన్ ప్రాంతాల్లో 8-12 తరగతులకు క్లాసులను పునరుద్ధరిస్తామని వెల్లడించారు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్. దీంతో.. అక్టోబర్ 4వ తేదీ నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.