కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం క్షీణిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈమేరకు శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి అక్కడ 50శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. ప్రేక్షకుల సీట్ల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. థియేటర్, మల్టీప్లెక్స్ ఆవరణలో సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ప్రేక్షకులు థియేటర్లలోకి ప్రవేశించగానే ముందుగా థర్మల్ స్క్రీన్…
కరోనా మహమ్మారి దేశాన్ని ఎంతగా వణికిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా వలన మహారాష్ట్ర తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే మహమ్మారి నుంచి బయటపడుతున్నది. కరోనాను తరిమి కోట్టడంలో గ్రామాలు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. చాలా గ్రామాలు స్వయంగా లాక్డౌన్, స్వీయనియంత్రణ వంటివి ప్రకటించుకొని బయటపడుతున్నాయి. కరోనాను తరిమికొట్టడంలో గ్రామాలు చురుకైన పాత్రను పోషిస్తుండటంతో ప్రభుత్వం ఆసక్తికరమైన పోటీని తీసుకొచ్చింది. కరోనాను తరిమికొట్టి కరోనా ఫ్రీ విలేజ్ గా నిలిచిన గ్రామాలకు ప్రభుత్వం రూ.50 లక్షల రూపాయల బహుమానం ప్రకటించనుందని…
మహారాష్ట్రలో కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 90 వేలను దాటేసింది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 24,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 601 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో.. 36,176 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,14,368 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 90,349కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య…
కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర అతలాకుతలం అయ్యింది. రెండు దశల్లో ఆ రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొన్నది. సెకండ్ వేవ్ సమయంలో ఆ రాష్ట్రం మరింతగా దెబ్బతిన్నది. ఏప్రిల్ 5 వ తేదీ నుంచి మహారాష్ట్రలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులపాటు నైట్ కర్ఫ్యూ, ఆ తరువాత ఉదయం కర్ఫ్యూ అమలు చేసిన సర్కార్, ఒక దశలో 144 సెక్షన్ కూడా అమలు చేసింది. కేసులు తగ్గకపోవడంతో లాక్ డౌన్ ను అమలు చేసింది. జూన్…
మహారాష్ట్ర ఏజెన్సీలో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈరోజు ఉదయం గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో సుమారు 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాలు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కొట్మీ పోలీస్ స్టేషన్ పరిధిలో సీ-60 బెటాలియన్‌కు చెందిన భద్రతా బలగాలు ఎటపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడి కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో సుమారు 13మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా…
టౌటే తుఫాన్ ధాటికి పశ్చిమ తీరం అతలాకుతలం అయింది. కన్యాకుమారి నుంచి కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ తీరాన్ని తాకే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అలలు విరుచుకుపడ్డాయి. ఇక ముంబై మహానగరాన్ని ఈ టౌటే తుఫాన్ వణికించింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయడంతో పాటుగా భారీ వర్షం కురిసింది. టౌటే తుఫాన్ గుజరాత్ తీరాన్ని దాటడానికి రెండు గంటల సమయం పట్టింది. ముంబై…
కరోనా ఫస్ట్ వేవ్‌లోనే కాదు.. సెకండ్ వేవ్‌లోనూ మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. దేశంలోనే అత్యధిక కేసులు వెలుగు చూస్తూ వస్తోన్న మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో రికవరీ కేసులు పెరిగాయి.. కొత్తగా 34,389 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా.. మరో 974 మంది ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో…
కరోనా కాలంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ కాలంలో కేసులు మరింత భారీగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇక మహారాష్ట్రలో కేసుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ వేవ్ కారణంగా ఆ రాష్ట్రం తీవ్రంగా ఇబ్బందులు పడింది. పూణే జిల్లాలోని బారామతిలోని ముదాలే గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ అనే బామ్మకు జ్వరం రావడంతో కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో బామ్మను హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు. అయితే,…
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒకవైపు కరోనా కేసులతో పాటు, మరోవైపు మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో దాదాపుగా రెండు వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి పేర్కోన్నారు. బ్లాక్ ఫంగస్ కేసుల బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తుండటంతో వీరికోసం మెడికల్ కాలేజీకలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను బ్లాక్ ఫంగస్ చికిత్స కేంద్రాలుగా మార్చి చికిత్స అందిస్తున్నారు. బ్లాక్ ఫంగస్…