గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మహారాష్ట్రలో వర్షాల కారణంగా.. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.. ఇక, యావత్మాల్ జిల్లాలో వరదలో బస్సు కొట్టుకుపోయింది.. దాహగాం పుల్మారాలో వాగు వంతెనపై నుంచి వదర నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. మహారాష్ట్ర ఎస్టీ బస్‌ను అలాగే పోనించాడు డ్రైవర్.. అయితే, వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో.. బస్సు కొట్టుకుపోయింది.. ఇక, స్థానికులు అప్రమత్తం అయ్యి.. బస్సులో ఉన్న ఇద్దరిని రక్షించినట్టు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో.. డ్రైవర్, కండక్టర్ సహా నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.. ఉమర్‌ఖేడ్ నుండి పుసాద్ దహాగావ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. దహాగావ్ వంతెనపై ప్రమాదానికి గురైంది.. ఇది నాగపూర్ డిపోకు చెందిన బస్సుగా చెబుతున్నారు. అయితే, ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురు వరదలో మిస్ అయినట్టు అధికారులు వెల్లడించారు.