మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. తాజాగా అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఆరోపణలపై లిఖిత పూర్వకంగా స్పందిస్తామని ఈసీ స్పష్టం చేసింది. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. "రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ప్రాధాన్యత ఇస్తుంది.
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్ సీపీ-ఎస్ సీపీ ఎంపీ సుప్రియా సూలేతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చారని అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 32 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారన్నారు.…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బెళగావిలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ మాట్లాడారు.
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కళ్ల ముందు ఉన్నవారే ఉన్నట్టుండి మాయమైపోతున్నారు. ఇటీవల కర్ణాటకలో ముగ్గురు యువతులు.. స్విమ్మింగ్ ఫూల్‌లోకి ఈత కొట్టడానికి దిగి.. ఊపిరాడక కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. సోమవారం సాయంత్రం నాగ్‌పూర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై రాళ్లతో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు.
రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నందుర్‌బార్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల బ్యాగ్‌లు తనిఖీలు చేయడంపై పెద్ద ఎత్తున ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల అధికారులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అగ్ర నాయకుల వాహనాలను తనిఖీలు చేశారు.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో నగదు ప్రవాహంలాగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో విచ్చలవిడిగా డబ్బు కట్టలు తరలిస్తున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓటర్లను దర్శనం చేసుకుంటున్నారు. ఇంకోవైపు అన్ని పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓట్లు కోసం అన్ని వర్గాలకు హామీలు ఇచ్చేస్తున్నారు. అయితే ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి మాత్రం మరో అడుగు ముందుకేసి.. తనను అసెంబ్లీకి పంపిస్తే.. పెళ్లికాని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు చేస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఈ వార్త వైరల్‌గా మారింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను ప్రకటించింది. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీచే ఈ వాగ్దానాలను ప్రకటింపజేశారు. భాగ్యలక్ష్మీ పేరుతో మహిళలకు నెలకు రూ.3 వేలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు.