మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు పోస్టర్ల వ్యవహారం ఎన్డీఏ కూటమిలో రాకరేపతున్నాయి. డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌కు సంబంధించిన పోస్టర్లు ముంబైలో కలకలం రేపుతున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల వేళ హస్తం పార్టీకి భారీ షాక్ తగిలింది. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న రవి రాజా.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. హస్తానికి బై బై చెప్పి కమలం గూటికి చేరారు. దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో రవి రాజా బీజేపీలో చేరారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అంకం ముగిసింది. ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల గడువు మంగళవారం ముగిసింది. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది.
శీతాకాలంలో మహారాష్ట్ర ఎన్నికలు హీటు పెంచుతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓ వైపు నామినేషన్లు.. ఇంకో వైపు ప్రచారాలు దూకుడుగా సాగిపోతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో పెద్ద పెద్ద ధనవంతులే పోటీ చేస్తున్నారు.
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో పొత్తు చర్చలు సఫలీకృతం అయ్యాయి. సీట్ల షేరింగ్‌పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చాయి. మూడు పార్టీలు కూడా రాష్ట్రంలోని 288 సీట్లకు గానూ ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తు్న్నాయి. వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇంకోవైపు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే.. అధికారం చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి అడుగులు వేస్తోంది. ఇలా ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా మేథోమథనం చేస్తున్నాయి.
Uddhav Thackeray: ప్రతిపక్ష నేతల్ని దెబ్బతీయాలని బీజేపీ నాయకులకు ఆదేశాలు అందాయని శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, ఎన్సీసీ(ఎస్పీ) శరద్ పవార్లను లక్ష్యంగా చేసుకోవాలని బీజేపీ నేతలకు క్లోజ్ డోర్ మీటింగ్‌లో అమిత్ షా ఆదేశించారని ఆరోపించారు. ఆదివారం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్తుని ప్రజలే నిర్ణయిస్తారని, అధికారంలో ఉన్న బీజేపీ కాదని అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వసన్నద్ధం అవుతున్నాయి. ఓ వైపు ఎన్డీఏ కూటమి.. ఇంకో వైపు ఇండియా కూటమి పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అయితే ఎన్నికలకు వెళ్లే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమి పక్షాలు ఎవరికి వారే ఎత్తుగడలు వేస్తు్న్నారు.