Maharashtra Polls: సీఎం ఏక్‌నాథ్‌షిండే, అజిత్ పవార్ బ్యాగ్‌లు తనిఖీ.. సహకరించిన అగ్ర నేతలు
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల బ్యాగ్‌లు తనిఖీలు
- సీఎం ఏక్‌నాథ్‌షిండే..అజిత్ పవార్ బ్యాగ్‌లు తనిఖీ
- సహకరించిన అగ్ర నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల బ్యాగ్‌లు తనిఖీలు చేయడంపై పెద్ద ఎత్తున ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల అధికారులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అగ్ర నాయకుల వాహనాలను తనిఖీలు చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పాల్ఘర్ పోలీస్ గ్రౌండ్ హెలిప్యాడ్ దగ్గర సీఎం ఏక్‌నాథ్ షిండే బ్యాగులను తనిఖీ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి బ్యాగుల తనిఖీలకు సహకరించారు. అలాగే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెలికాప్టర్‌ను, బ్యాగులను తనిఖీలు చేశారు. తనిఖీలకు పూర్తిగా సహకరించినట్లు అజిత్ పవార్ ట్వీట్ చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడానికి సహకరిస్తామన్నారు.

Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
సీఏం ఏక్‌నాథ్ షిండే బుధవారం పాల్ఘర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్యటనలో భాగంగా పాల్ఘర్ పోలీస్ గ్రౌండ్‌కు తన హెలికాప్టర్‌తో వచ్చారు. ఆ సమయంలో ఎన్నికల అధికారులు హెలికాప్టర్‌లో ఉన్న ఏక్‌నాథ్ షిండే వ్యక్తిగత స్కూట్‌కేసును పరిశీలించేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న షిండే వ్యక్తి గత సిబ్బంది సూట్‌కేసులో దుస్తులు తప్ప ఏమిలేవని చెబుతుండగా.. మధ్యలో షిండే జోక్యం చేసుకుని వారి డ్యూటిని వారిని చేయనివ్వండి అంటూ ఎన్నికల అధికారులకు అనుమతి ఇచ్చారు. దీంతో షిండే సూట్‌కేసును పరిశీలించగా అందులో దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. అలాగే హెలికాప్టర్‌లో పూణెకి వచ్చిన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే బ్యాగును కూడా ఎన్నికల అధికారులు చెక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
ప్రతిపక్షాలకు చెందిన నేతల ఇళ్లు, బ్యాగులు మాత్రమే పరిశీలిస్తున్నారని, అధికార కూటమి నేతల విషయంలో నిబంధనలు అమలు చేయడం లేదని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ బ్యాగులు తనిఖీలు చేశారు.
#WATCH | Maharashtra: CM Eknath Shinde’s bags were checked at Palghar Police ground helipad where he reached for the election campaign.
(Source: Shiv Sena) pic.twitter.com/44CnWiTYzG
— ANI (@ANI) November 13, 2024
#WATCH | Maharashtra Dy CM Ajit Pawar tweets, "Today, while on my way for election campaigning, the Election Commission conducted a routine check of my bags and helicopter. I fully cooperate and believe that such measures are essential to ensure free and fair elections. Let us… pic.twitter.com/KbL9lVnNTh
— ANI (@ANI) November 13, 2024
తాజావార్తలు
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!