మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ ప్రింటింగ్ చేస్తోంది.
మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త చట్టంలోని అంశాలను అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో స్త్రీ శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం శాఖల కార్యదర్శులు, హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి ఉన్నారు.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి ఊరట లభించింది. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిపై ఉన్న లుక్ అవుట్ సర్క్యూలర్ (ఎల్‌ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఇమ్మిగ్రేషన్ బ్యూరో దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో రియాకు భారీ ఊరట లభించినట్టు అయ్యింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020…
Swapnil Kusale Father Slams Maharashtra Govt: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలే కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్‌లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన 29 ఏళ్ల స్వప్నిల్.. బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్న స్వప్నిల్.. ఒలింపిక్స్ అరంగేట్రం కోసం 12 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే ఆడిన తొలి ఒలింపిక్స్‌లోనే పతకం…
మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. నూతన ఆరోగ్య బీమా పథకం.. మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్ ఆరోగ్య అభియాన్ (MJPJAY)ని ప్రతి ఒక్కరికీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ పథకం వార్షిక ప్రీమియంను 60% పెంచి రూ.3,000 కోట్లకు పైగా పెంచింది. జూలై 1 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. కొత్త ఆరోగ్య బీమా పథకం కింద.. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు 1.5…
Anil Ambani: ముంబై మెట్రో వన్‌లో అనిల్ అంబానీ కంపెనీ వాటాకు సంబంధించిన ఒప్పందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ వారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో , విద్యా ఉపాధి అవకాశాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్‌లు కల్పించాలని బాంబే కోర్టును ఆశ్రయించిన వినాయక్ కాశీద్ అనే పిటిషనర్ తరపున వాదనలు విన్న కోర్టు లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులకు ప్రత్యేక రిజర్వేషన్‌లు కల్పించే అధికారం తమ పరిధిలో లేదని తేల్చి చెప్పింది.
ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ ఆలయంలోకి బలవంతంగా చొరబడ్డారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని నాసిక్‌లో నలుగురు ముస్లిం పురుషులను పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేసింది.