Asaduddin Owaisi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అక్కడ రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రధాని మోడీ అరబ్ దేశాలకు వెళ్లిన సమయంలో ఇదే భాషను ఉపయోగిస్తారా..? అని ప్రశ్నించారు. మహరాష్ట్రలో రైతు ఆత్మహత్యల వంటి ప్రధాన సమస్యలపై అధికార పార్టీ దృష్టి మళ్లించిందని ఆరోపించారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపి అవమానిస్తు్న్నారడని అమిత్ షా మండిపడ్డారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయడాన్ని బీజేపీ ఎప్పటికీ అంగీకరించడని షా అన్నారు.
Maharashtra Elections: మహారాష్ట్ర రాజకీయాలు ముంబైలోని ధారావి స్లమ్ ఏరియా చుట్టూ తిరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావి ప్రాజెక్టు రద్దు చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. దీంతో ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల కోసం తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ, ధారావి ప్రాజెక్టు ముంబయిపై ప్రభావం చూపుతుందని, తాను అధికారంలోకి వస్తే దానిని రద్దు చేస్తామని థాకరే నిన్న చెప్పారు.
C Voter Survey Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి ఆసక్తి నెలకొంది. హర్యానాలో ఘన విజయం సాధించిన బీజేపీ, మరోసారి మహారాష్ట్రలో కూటమిగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి( బీజేపీ-ఎన్సీపీ అజిత్ పవార్- శివసేన ఏక్‌నాథ్ షిండే), మరోవైపు ‘మహా వికాస్ అఘాడీ’( కాంగ్రెస్-ఎన్సీపీ శరద్ పవార్- శివసేన ఉద్ధవ్ ఠాక్రే) కూటమి పోటీ పడుతున్నాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఖేద్కర్ ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దిలీప్ ఖేద్కర్ షెవ్‌గావ్ అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
Maharashtra Assembly Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు వారి కోరిక మేరకు సీట్లు ఇవ్వడం ద్వారా బీజేపీ వచ్చేసారి అధికారంలోకి వస్తే అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీ నుంచే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేసింది.
Maharashtra Assembly Elections: దేశం మొత్తం మహారాష్ట్ర్ర అసెంబ్లీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం, జమ్మూ కాశ్మీర్‌లో ఫలితాల తర్వాత మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉండబోతాయా..?
Maharashtra Elections: మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో పొత్తు చర్చలు ముగిసినట్లే కనిపిస్తోంది. సీట్ల షేరింగ్‌పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చాయి.
Batenge to Katenge: మహారాష్ట్ర ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నినాదం ‘‘బాటేంగే తో కటేంగే’’ మారుమోగుతోంది. మహరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో యోగి ఫోటో, నినాదంతో ప్లేక్సీలు వెలిశాయి. ముఖ్యంగా ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు సందడి చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల సమయంలో కూడా ఈ నినాదం చాలా ఫేమస్ అయింది. ‘‘ విడిపోతే.. నాశనం అవుతాం’’ అని అర్థమయ్యే ఈ నినాదాన్ని హిందువుల ఐక్యత కోసం యోగి చెప్పినట్లు తెలుస్తోంది. Read Also:…
మహారాష్ట్రలో ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు శివసేన(యూబీటీ) నేతలు తెలిపారు. సీట్ల పంపకాలపై ఇండియా కూటమిలో విభేదాలు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. శివసేన(యూబీటీ) ఒంటరిగా పోటీ చేస్తుందని వార్తలు షికార్లు చేశాయి.