Maharashtra Elections: మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో పొత్తు చర్చలు ముగిసినట్లే కనిపిస్తోంది. సీట్ల షేరింగ్‌పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చాయి. మూడు పార్టీలు కూడా రాష్ట్రంలోని 288 సీట్లకు గానూ ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించారు. మూడు పార్టీలు మొత్తం 255 సీట్లలో పోటీ చేయగా.. మిగిలిన 33 సీట్లలో కూటమిలోని చిన్న మిత్రపక్షాలకు కేటాయించనున్నట్లు తెలిసింది.
Read Also: Punjab and Haryana HC: భర్తని ‘‘నపుంసకుడు’’ అని పిలవడం మానసిక క్రూరత్వమే..
గత కొన్ని రోజులుగా ఎంవీఏ కూటమిలో విభేదాలు కనిపించాయి. ముఖ్యంగా శివసేన ఠాక్రే వర్గానికి, కాంగ్రెస్‌కి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే నడిచింది. ఠాక్రే వర్గం విదర్భలో కాంగ్రెస్ నుంచి మరో 8 సీట్లకు పట్టుబట్టింది. మొత్తంగా మహారాష్ట్రలో 17 సీట్లను కాంగ్రెస్ నుంచి కోరింది. దీంతో సీట్ షేరింగ్‌పై ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రస్తుతం సీట్ షేరింగ్‌కి తెరపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శివసేన ఠాక్రే వర్గం 65 మందితో అభ్యర్థుల తొలి లిస్ట్‌ని విడుదల చేసింది.