కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో అబద్ధాలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో అబద్ధాలు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని మాట తప్పారుని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్ర లో కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీ లు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ లో మోసం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రుణమాఫీ చేస్తాం అని చెప్పి మాట తప్పినం అని మహారాష్ట్ర లో చెప్పాల్సి ఉండే అన్నారు. మహారాష్ట్ర కు వెళ్లి అన్ని గ్లోబల్స్ ప్రచారం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్ లో అబద్ధాలు పెట్టారని మండిపడ్డారు. మహాలక్ష్మి, రైతు భరోసా, రైతు కూలీలకు డబ్బులు, వరిపంట కు బోనస్, అమలు చేయట్లేదు అని చెప్పాల్సి ఉండే అన్నారు. తెలంగాణ లో అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. మేము మహారాష్ట్ర లో పోటీ చేయట్లేదన్నారు. అక్కడికి వెళ్లి ప్రచారం చేయమన్నారు. అందుకే ఇక్కడి నుండే కాంగ్రెస్ మోసాలపై చెబుతున్నామని క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ డబ్బులు వాడుతున్నారని ఆరోపించారు..
రైతులు, మహిళలు, యువతపై బీజేపీ ప్రత్యేక దృష్టి.. మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, యువతపై ప్రత్యేక దృష్టి సారించారు. తీర్మాన లేఖను విడుదల చేసిన అమిత్ షా.. ఇది మహారాష్ట్ర ఆకాంక్షల తీర్మాన లేఖ అని అన్నారు. ఇందులో రైతుల పట్ల గౌరవం, పేదల సంక్షేమం ఉన్నాయి. ఇందులోనే స్త్రీల ఆత్మగౌరవం ఉంది. ఇది మహారాష్ట్ర ఆశల మేనిఫెస్టో. ఈ తీర్మాన లేఖ రాతి రేఖ లాంటిది. అఘాడీ పథకాలన్నీ అధికారం కోసమేనని షా అన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే, ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఫడ్నవీస్ మాట్లాడుతూ మహారాష్ట్ర సంపూర్ణ అభివృద్ధికి ఇదో తీర్మానం అన్నారు. రిజల్యూషన్ లెటర్ అభివృద్ధి చెందిన మహారాష్ట్రకు రోడ్‌మ్యాప్. రైతుల రుణాలను మాఫీ చేస్తానని ఫడ్నవీస్ చెప్పారు. మహారాష్ట్రలోని 25 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.
పగటి కలలు కంటున్నారు.. కేసీఆర్ పై అద్దంకి కీలక వ్యాఖ్యలు
ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తామని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సెటైర్ వేశారు.
కేసీఆర్ పగటి కలలు కంటున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ని.. భరించే పరిస్థితిలో ప్రజలు లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చడానికేనా ప్రభుత్వం అంటున్నావు… మీరు కూల్చిన వ్యవస్థలను మేము నిర్మిస్తున్నామన్నారు. మీ అవినీతి క్షేత్రాలు కూల్చడమే పనిగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. బురదలో.. మట్టిలో.. చెరువులో మీరు చేసినంత అవినీతి ఎవరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాటు ఎక్కడ ఉన్నాడో ఆయనకైన అర్దం అవుతుందా..? అని ప్రశ్నించారు. ప్రజలకు దూరంగా ఉన్న ఆయన మళ్ళీ సర్కారు వస్తదని భ్రమ పడుతున్నారని సంచల వ్యాఖ్యలు చేశారు. బయట మీ అల్లుడు.. కొడుకు చేస్తున్న విధ్వంసం చూడండి అని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కూల్చడానికి కాదు నిర్మాంచడానికి అని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కేసీఆర్ కూల్చివేసిన వ్యవస్థలను పునరుద్ధరించడమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. హైదరాబాద్ పునర్నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. మూసీ శుభ్రం చేసేందుకు అక్కడి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపుతుందని అద్దంకి దయాకర్ అన్నారు.
నగరంలో కొత్త టెండర్లు తీసుకునే పరిస్థితి లేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
నగరంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని కారణంగా కొత్త టెండర్లు తీసుకునే పరిస్థితి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లి డివిజన్‌లోని డి-క్లాస్‌లో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన అనంతరం ఆసిఫ్‌నగర్ డివిజన్‌లోని దయాబాగ్‌లో G+01 కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు. గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా, కార్పొరేటర్లుగా మజ్లిస్ పార్టీ నేతృత్వం వహిస్తుందన్నారు. మజ్లిసేతర ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కూడా ప్రజలకు అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండపడ్డారు. మజ్లిస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పక్షపాతంతో వ్యవహరిస్తూ ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు.
మాది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదు: డిప్యూటీ సీఎం పవన్
తమది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఐపీఎస్ అధికారులపై మాజీ సీఎం వైఎస్ జగన్ బెదిరింపులు ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసులు పెడతామన్నారు. మహిళల సంరక్షణ తమ మొదటి ప్రాధాన్యత అని, అందుకోసం ఏం చేయాలో ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయని పవన్ పేర్కొన్నారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను పేరుపేరునా పవన్ పలకరించారు.
మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఏక్‌నాథ్ షిండే కాదు.. సీఎం అభ్యర్థి ఎంపికపై షా కీలక ప్రకటన
మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ తీర్మానం లేఖను హోంమంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. దీని తర్వాత.. తన ప్రసంగంలో అమిత్ షా ముఖ్యమంత్రి పదవికి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అని, అయితే ఎన్నికల తర్వాత అందరం కూర్చుని దీనిపై చర్చిస్తామని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్‌ను కూడా టార్గెట్ చేశారు. ఈసారి ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం శరద్ పవార్‌కు ఇవ్వబోమని అన్నారు. శరద్ పవార్‌కు తప్పుడు కథనాలు చెప్పడం అలవాటుగా మారిందని విమర్శించారు. కానీ ఈసారి ఆయన కథలు పని చేయవన్నారు.
అపర భగీరథ ప్రయత్నాన్నిఅడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు..
అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు పార్లమెంట్‌కు పంపారని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ మహబూబ్ నగర్‌కు ఏం చేశారు? అని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, పరిశ్రమలు రాలేదని మండిపడ్డారు. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల వలసలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే మక్తల్, నారాయణ్ పేట్, కొడంగల్ ప్రాజెక్టు పనులు.. అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వలసలు ఆపాలని నేను ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ హైవేపై అగ్నిప్రమాదం
కొత్త కార్లను తరలిస్తున్న కంటైనర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో జరిగిన ఈ ఘటనలో 8 కొత్త కార్లు దగ్ధమయ్యాయి. కంటైనర్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగి, నల్లటి పొగతో అల్లుకున్నాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే లారీని పక్కకు నిలిపి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే మంటలు పూర్తిగా వ్యాప్తి చెందగా, కంటైనర్‌లోని 8 కొత్త కార్లు పూర్తిగా కరిగిపోయాయి. ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారాన్ని అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, మంటలు తీవ్రంగా వ్యాపించడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను సరిచేయడం ప్రారంభించారు.
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడింది
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడిందని, అది దేశంలో ఎక్కడా లేనంత సులభతర వాణిజ్య విధానాల ద్వారా సాధ్యమైందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మలేషియా రాష్ట్రం కౌలాలంపూర్‌లో ఆదివారం జరిగిన తెలంగాణా దశాబ్ది ఉత్సవాలలో పాల్గొనడం ద్వారా, మలేషియా పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తాము వారికి ఆహ్వానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, మలేషియా-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాలని, రెండు దేశాల సంస్కృతుల్లో అనేక సారూప్యతలు ఉన్నందున పరస్పర సహకారం సులభంగా జరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి.. ఇప్పుడు అధికారులను బలిపశువులను చేస్తున్నారు
హన్మకొండ జిల్లా బీఆర్ఏస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌లో స్వాగతం పలికిన జిల్లా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు కామారెడ్డి సభలో బి సి డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయిందని, బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి ఒక్కటైనా హామీ చేసిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. చేతి గుర్తుకు ఓటు వేస్తే చేతి వృత్తుల వాళ్లకు గొంతు కోసిన పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతోందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉండేది కులవృత్తులను బలోపేతం చేసేలాగా ఎన్నో పథకాలు తీసుకొచ్చావన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీ వర్గాలకు తీరని అన్యాయం చేస్తుందని, రేవంత్ రెడ్డి రాగానే బీసీ బంద్ బంద్ అయింది రైతుబంధు బంద్ అయిందన్నారు కేటీఆర్. బీసీల ఓట్ల కోసం ఇప్పుడు కులగనన అని కొత్త నినాదం ఎత్తుకున్నారని, సర్వే కోసం ఇంటికి వెళ్తే అధికారులను జనం నిలదీస్తున్నారన్నారు కేటీఆర్.