Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపి అవమానిస్తు్న్నారడని అమిత్ షా మండిపడ్డారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయడాన్ని బీజేపీ ఎప్పటికీ అంగీకరించడని షా అన్నారు. ‘‘ రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో రాజ్యాంగం కాపీని పంపారు. కవర్‌పై భారత రాజ్యాంగం అని ఉంటే, లోపల మాత్రం ఖాళీ పేజీలు మాత్రమే దర్శనమిచ్చాయి. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. బీఆర్ అంబేద్కర్‌ని కాంగ్రెస్ అవమానించింది’’ అని జార్ఖండ్‌లో పాలములో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా అన్నారు.
Read Also: Huzurabad: హుజురాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. కౌశిక్ రెడ్డికి అస్వస్థత
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయించినట్లు చెప్పారు. ఓబీసీలు, దళితులు, గిరిజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, మైనారిటిలకు ఇవ్వాలని చూస్తోందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ ఓబీసీ కోటాకు వ్యతిరేకం, ఉలేమాల బృందం కాంగ్రెస్ నాయకులను కలిసిన సందర్భంలో, మైనారిటీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని, పీఎం మోడీ నాయకత్వం ఎప్పటికీ మత రిజర్వేషన్లను అనుమతించడని అమిత్ షా అన్నారు.
కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, మీ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాలేదని రాహుల్ గాంధీని అమిత్ షా హెచ్చరించారు. జేఎంఎం నేతృత్వంలోని జార్ఖండ్‌లోని ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని అభివర్ణించారు. 8181 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో నవంబర్ 20న 288 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు 23న జరుగుతుంది.