మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నాయి. అదే సమయంలో.. మహా వికాస్ అఘాడీ (MVA) మరోసారి నిరాశను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఈ పోకడల మధ్య, భారతీయ రాజకీయ ప్రముఖుడు, ఎన్‌సీపీ(SP) అధినేత శరద్ పవార్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ పనితీరు వారసత్వంపై పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
Devendra Fadnavis: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సంచలన ఫలితాలు నమోదు చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ‘‘మహాయుతి’’ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు గానూ ప్రస్తుతం 220 కిపైగా స్థానాల్లో బీజేపీ+షిండే సేన+అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే సేన, శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 54 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్నాయి.
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. మొత్తం 288 స్థానాలకు గానూ 221 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే సిద్ధమైంది. ఈ మేరకు ఈనెల 25వ తేదీన లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.
Bandi Sanjay: బీజేపీ ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుందని కేంద్ర మంత్రి బండిసంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బండిసంజయ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయదుంధుబి మోగిస్తుంది అన్నారు.
Shiv Sena: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి సత్తాచాటుతోంది. బీజేపీ+శివసేన(షిండే)+ ఎన్సీపీ(అజిత్ పవార్)ల ‘‘మహయుతి’’ కూటమి సంచలన విజయం సాధిస్తోంది. మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి ఏకంగా 219 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్+ఠాక్రే సేన+శరద్ పవార్ ఎన్సీపీల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి కేవలం 55 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివాదాస్పద ఫత్వా జారీ చేసిన ఇస్లామిక్ మత నాయకుడు మౌలానా సజ్జాద్ నోమానీపై బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే-శరద్ పవార్ కూటమికి ఓటేయాలని రాష్ట్రంలో ముస్లింలకు పిలుపునివ్వడంపై వీడియో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలో బీజేపీ ఓటమి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచగలదని తాను నమ్ముతున్నానని నోమని అన్నారు. ఈ వీడియోపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు…
Maharashtra: శనివారంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏ పార్టీనో స్పష్టత రానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి చెందిన కీలక నేత ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో చేరారు.
ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేసింది. అలాగే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 373గా రికార్ట్ అయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో తొమ్మిదింటిలో ఏక్యూఐ లెవల్స్ తీవ్రమైన కేటగిరీలో…
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి. 288 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. ఇదిలా ఉంటే, ఇంకా ఫలితాలు రాకముందే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో సీఎం అభ్యర్థిపై కొట్లాట మొదలైంది.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఓటింగ్ జరగగా, బీడ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బీడు అసెంబ్లీ స్థానంలో ఓటింగ్ సందర్భంగా ఓ స్వతంత్ర అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందారు.