Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల షేరింగ్‌పై బీజేపీ-షిండే శివసేన- అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ‘‘మహాయుతి’’ స్పీడ్ పెంచింది. సీట్ల షేరింగ్ విషయమైన గత రాత్రి కేంద్ర హోం మంత్రితో కూటమి నేతలు భేటీ అయ్యారు. చర్చలు కీలక దశలో ఉన్న సమయంలో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో అమిత్ షాని కలిశారు.
Maharashtra Elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల క్రితం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 20న ఒకే విడతలో రాష్ట్రంలోని 288 స్థానాలకు పోలింగ్ నిర్వహించి, 23న ఫలితాలను వెల్లడించనున్నట్లు చెప్పింది. మహారాష్ట్రలో అధికార ‘మహాయుతి’, విపక్ష ‘మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)’ మధ్య పోరు రసవత్తరంగా మారింది. హర్యానా ఎన్నికల విజయంతో బీజేపీ కూటమి ‘మహాయుతి’ మంచి జోరుపై ఉంది. మరోవైపు కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(శరద్ పవార్) ఎంవీఏ కూటమిలో మాత్రం విభేదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.
Swara Bhasker: బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ద్వేషిగా, హిందూ ద్వేషిగా విమర్శలు ఎదుర్కొనే స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఫహద్‌ని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఎన్సీపీ-ఎస్‌పీ ఎంపీ సుప్రియా సూలేకి గొడుకు పట్టుకున్న వీడియో వైరల్ అయింది. మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ(ఎంపీఏ) ర్యాలీలో ప్రసంగిస్తున్న సుప్రియా సూలేకి ఫహద్ గొడుగు…
Sayaji Shinde: ప్రముఖ నటుడు సాయాజీ షిండే రాజకీయ పార్టీలో చేరారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అజిత్ పవార్‌కి చెందిన ఎన్సీపీ పార్టీలో శుక్రవారం చేరారు. అజిత్ పవార్ స్వయంగా సాయాజీ షిండేని పార్టీలోకి స్వాగతించారు.
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ -శివసేన(షిండే)- ఎన్సీపీ(అజిత్ పవార్)ల ‘‘మహాయుతి’’ కూటమి భావిస్తుంటే, బీజేపీ కూటమికి ఎలాగైనా చెక్ పెట్టాలని కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(శరద్ పవార్)ల ‘‘మహావికాస్ అఘాడీ’’ భావిస్తోంది. నవంబర్ నెలలో ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తోంది.
Maharashtra: మహారాష్ట్ర ఆహార- ఔషధ నిర్వహణ శాఖ మంత్రి, ఎన్సీపీ (అజిత్ పవార్) సీనియర్ నేత ధర్మారావుబాబా ఆత్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ద్రోహం’’ చేసినందుకు తన కుమార్తె భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్‌లను ప్రాణహిత నదిలో పారేయాలని అహేరి నియోజకవర్గ ఓటర్లు కోరారు. వీరిద్దరు శరద్ పవార్ ఎన్సీపీ వర్గంలో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈయన ఈ వ్యాఖ్యలుచేశారు.