Stock Market Today: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సోమవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. వారంలో (నవంబర్ 25) మొదటి ట్రేడింగ్ రోజున, స్టాక్ మార్కెట్ భారీ గ్యాప్ అప్ తో ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు జోరుగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం తర్వాత, స్టాక్ మార్కెట్‌లో బలమైన పెరుగుదల కనపడింది. Also Read: IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన…
BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వినోద్ తావ్డే, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సుప్రియా శ్రీనాట్, రాహుల్ గాంధీలకు లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు.
Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచేది ఎవరో రేపటితో తేలబోతోంది. అయితే, అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా బీజేపీ నేతృత్వంలోని షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ‘‘మహాయుతి’’ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మలబార్ హిల్‌లో సంపన్నులు ఓటేయరని గోయెంకా వ్యంగ్యాస్త్రాలు సంధింస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టులో.. మలబార్ హిల్‌లో సంపన్నులు పోలింగ్ కేంద్రానికి మెర్సిడెస్ బెంజ్‌లో వెళ్లాలా? లేదంటే బీఎండబ్ల్యూ కారులో వెళ్లాలా అని చర్చిస్తూ కూర్చుంటారని ఎద్దేవా చేశారు.
Maharashtra Elections 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో మతం ఆధారంగా ఓట్లు అడిగేలా అనేక ముస్లిం సంస్థలు ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ శనివారం ఆరోపించింది. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టుని కోరింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యకర్త మౌలానా సజ్జాద్ నోమాని మహారాష్ట్రలో మహా వికాస్…
మహారాష్ట్ర బల్లార్‌పూర్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మరాఠీ, హిందీ, తెలుగులలో ఆయన ప్రసంగించారు. తన మరాఠీలో ఏమైనా తప్పులు దొర్లితే క్షమించాలన్నారు. ఈ రెండు రోజుల్లో మరాఠీ బాగానే తెలుసుకున్నానని అన్నారు. శివాజీ మహరాజ్ భూమి ఐన మరాఠా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తానన్నారు.
ఈ రోజు మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో మొదట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతంగా చెప్పుకొచ్చారు.. బాలా సాహెబ్ ఠాక్రే (బాల్ ఠాక్రే) నుంచి తాను ఎంతో నేర్చుకున్నాను.. శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
Ajit Pawar: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నవంబర్ 20న రాష్ట్రంలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి తలపడుతున్నాయి. బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలో తన ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘‘బాటేంగే తో కటేంగే’’( విడిపోతే, దెబ్బతింటాం) అనే నినాదంపై వివాదం చెలరేగింది.
Kiren Rijiju: రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ నేత కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పూణేలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి పరిపక్వత లేదని, విదేశాల్లో భారత్‌ని నిందించడం కారణంగా ఎవరూ నాయకులు కాలేరని హితవు పలికారు.