Uddhav Thackeray: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే, నాశనం అవుతాం) వ్యాఖ్యలపై ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అభ్యంతరం చెప్పారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ ఈ వ్యాఖ్యల్ని తిరస్కరించడంపై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు ఎక్కుపెడుతోంది.
PM Modi: మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ధులేలో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల వైపు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నవంబర్ 20న ఆ రాష్ట్రంలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన కూటములు పోటీ పడుతున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మహాకూటమిలో బీజేపీ అన్నయ్య పాత్రలో ఉన్నప్పటికీ.. శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మరోసారి రాష్ట్రంలో మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది.
Devendra Fadnavis: రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓట్ జిహాద్’’, నకిలీ కథనాలు పని చేయలేయవని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎన్డీటీవీతో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేవారు. నవంబర్ 20 ఎన్నికల తర్వాత మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఈ రోజు ధీమా వ్యక్తం చేశారు.
Maharashtra NCP: నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి నుంచి, ఛగన్ భుజ్‌బల్ యోలా నుంచి, దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ లిస్ట్‌లో వెలుగులోకి వచ్చిన విశేషమేమిటంటే.. 95% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు దక్కడం. ఈ జాబితాలోని ప్రముఖ నాయకుల్లో…
Maharashtra Elections 2024: నవంబర్ 13న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ప్రారంభించాయి. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పార్టీ శివసేన కూడా 45 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి పేరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఉండగా.. ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి – పచ్‌పఖాడి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, రాజ్…