Maharashtra: మహారాష్ట్ర సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే వెనక్కి తగ్గారు. ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు. ఎవరు సీఎం అయిన శివసైనికులు మద్దతు ఇస్తారని, తాను బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. మహారాష్ట్రకు కాబోయే సీఎం బీజేపీ నుంచే ఉంటారని తెలుస్తోంది.
Eknath Shinde: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే, తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమి ఎవరిని సీఎంగా ఎన్నుకన్నా శివసైనికులు వారికి మద్దతు ఇస్తారని షిండే స్పష్టం చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. ‘‘నా వల్ల మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఏదైనా సమస్య ఎదురైతే…
Maharashtra: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం వెలువడిని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ ఏకంగా 233 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 132 స్థానాలు గెలుచుకుని మరోసారి మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, ఫలితాలు వచ్చి నాలుగు రోజలు అవుతున్నా.. సీఎం ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు
Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్సీపీ అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే శివసేనల ‘‘మహాయుతి’’ కూటమి సంచలన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 233 సీట్లను గెలిచింది. అయితే, విజయం సాధించిన నాలుగు రోజులైనప్పటికీ, మహారాష్ట్రకు కాబోయే కొత్త సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఏక్‌నాథ్ షిండే ఉన్నారు.
శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో మహాయుతి కూటమి ఫెయిల్ అయిందని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఈ సస్పెన్స్ ఈరోజు (బుధవారం) ఉదయం వీడే ఛాన్స్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు భేటీ అవుతారని శివసేన(షిండే) నేత సంజయ్ శిర్సత్ పేర్కొన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. శివసేన ఎమ్మెల్యేలు ఆదివారం బాంద్రాలోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడ వారు శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్‌నాథ్ షిండేను తిరిగి ఎన్నుకున్నారు. ఉదయ్ సామంత్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏక్‌నాథ్ షిండేను మళ్లీ మహారాష్ట్ర సీఎంని చేయాలని శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. శివసేన అధికార ప్రతినిధి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ మాట్లాడుతూ.. "మా కూటమి పెద్ద విజయం సాధించింది. ఏక్‌నాథ్…
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు రెడీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది..? ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే ఇద్దరూ గట్టిగా పోటీ పడుతున్నారు.
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని, అయితే సీఎం పదవి తనకు రావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను తప్పకుండా సీఎం అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.