ఏపీ టీడీపీలో మహానాడు ఉత్సాహం కనిపిస్తోంది. ఒకే ఒక్క సభతో కేడర్ మనసు మారిపోయిందన్న ప్రచారం మొదలైంది. శ్రేణుల్లో దూకుడు చూశాక.. సభా వేదికపై పొత్తుల మాటే వినిపించలేదు. ఇప్పుడు టీడీపీ కేడర్ సైతం కొత్తరాగం అందుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చగా మారిపోయింది. మహానాడుకు ముందు జనసేనతో వన్‌సైడ్ లవ్‌లో ఉంది టీడీపీ. జనసేనాని నేరుగా చెప్పకపోయినా.. టీడీపీకి సానుకూల సంకేతాలు ఇచ్చేలా ప్రకటనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిచోట్ల టీడీపీ, జనసేన అవగాహనతో పోటీ…
మహానాడు విజయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఒంగోలులో మహానాడు విజయం ప్రజావిజయం అని అన్నారు. అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయిందిన నేతలతో అన్నారు. మహానాడు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిందని అన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన సీఎం జగన్ రాజకీయాలకే అనర్హుడని విమర్శించారు. ఇకపై విరామం వద్దని మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలకు పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నెలకు…
ఒంగోలులో టీడీపీ మహానాడు భారీస్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మహానాడుపై మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని.. ఆయనకు మతి భ్రమించిందని ఎన్టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు. వరుణ దేవుడి ఆశీస్సులు రాజశేఖర్ కుటుంబానికి ఉంటాయని చెప్పటానికి కురుస్తున్న వర్షాలే ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి జయరాం అభిప్రాయపడ్డారు. వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సీఎం…
అమెరికాలోని బోస్టన్‌లో టీడీపీ మహానాడు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే. ఈ నేపథ్యంలో అమెరికాలోని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహంపై హెలికాప్టర్ నుంచి టీడీపీ అభిమానులు పూలవర్షం కురిపించారు. టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ విషయాన్ని తెలుపుతూ వీడియో పోస్ట్ చేశారు. ఈ మహానాడులో ఆయన కూడా పాల్గొన్నారు. ‘అమెరికాలోని బోస్టన్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మహానాడు సంబరాల్లో, హెలికాప్టర్లో అన్న గారి విగ్రహం మీద పూలు చల్లుతూ భారీ ఎత్తున తెలుగుదేశం…
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీలో జోష్ తేవాలని చంద్రబాబు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లాలో జరిగే మహానాడును ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మహానాడులో ముఖ్యంగా 15 తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తీర్మానాలపై ఇప్పటికే టీడీపీ అగ్రనేతలు కసరత్తులు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే రాజకీయ తీర్మానాలకు సంబంధించి ఏయే అంశాలు ప్రస్తావించనున్నారనే అంశంపై అందరి దృష్టి పడింది. ఈ తీర్మానాల ద్వారా వచ్చే ఎన్నికల్లో…
ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న టీడీపీ మహానాడు వేదిక మారినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. తొలుత ఒంగోలు శివారులోని త్రోవగుంట బృందావన్ గార్డెన్ వెనుక వైపు ఖాళీ స్థలంలో మహానాడు నిర్వహించాలని టీడీపీ భావించింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంతంలో నీళ్లు నిలిచి బురదమయంగా తయారైంది. మరోసారి వర్షం పడితే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మహానాడు వేదికగా మార్చినట్లు టీడీపీ నేతలు వివరించారు. Minister Peddireddy:…
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడుకి ముందే జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా రేపు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దల్లవలస గ్రామంలో పర్యటించనున్నారు చంద్రబాబు. ఆయన పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి, పార్టీజిల్లా అధ్యక్షులు కూన రవికుమార్. రేపు సాయంత్రం 4 గంటలు నుండి 6 గంటలవరకు వరకు గ్రామంలో పర్యటించనున్నారు చంద్రబాబు. ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సమస్యలు తెలుసుకుంటారు.…
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. సమావేశానికి టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, టీడీపీ వ్యవహారాల ఇంచార్జ్ కంభంపాటి రామ్మోహన్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పార్టీ సంస్థాగత అభివృద్ధి, సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలతో పాటు మే లో హైదరాబాద్ లో జరిగే మినీ మహానాడు విజయవంతం చేయాలని పార్టీ నేతలకు…