టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడుకి ముందే జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా రేపు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దల్లవలస గ్రామంలో పర్యటించనున్నారు చంద్రబాబు. ఆయన పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి, పార్టీజిల్లా అధ్యక్షులు కూన రవికుమార్.
రేపు సాయంత్రం 4 గంటలు నుండి 6 గంటలవరకు వరకు గ్రామంలో పర్యటించనున్నారు చంద్రబాబు. ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సమస్యలు తెలుసుకుంటారు. నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుదల ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు చంద్రబాబు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలవరకు.. గ్రామ ప్రజలతో గ్రామ సభ నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల నుండి.. గ్రామంలోని దళిత , బడుగు , బలహీన వర్గాల సహపంక్తి భోజనం చేయనున్నారు చంద్రబాబు. అలాగే జగన్ పాలనలో పెరిగిన ధరలు, బిల్లుల పై బాదుడే బాదుడు కార్యక్రమానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.
Rk Roja: చంద్రబాబు బకాయిలు మేం చెల్లిస్తున్నాం