ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. సమావేశానికి టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, టీడీపీ వ్యవహారాల ఇంచార్జ్ కంభంపాటి రామ్మోహన్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పార్టీ సంస్థాగత అభివృద్ధి, సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలతో పాటు మే లో హైదరాబాద్ లో జరిగే మినీ మహానాడు విజయవంతం చేయాలని పార్టీ నేతలకు బాబు సూచించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం పై చర్చించాం. నెలలో రెండు రోజుల సమయం తెలంగాణకు బాబు కేటాయిస్తానన్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. టీడీపీ పుట్టిన గడ్డ మీద పార్టీ బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 22 నుండి డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. గ్రామ, మండల స్థాయి కమిటీల ఏర్పాటు..రాష్ట్ర స్థాయి కమిటీ సమీక్ష నిర్వహించారు.
Read Also:Chandrababu: బొజ్జల ఇంటికి వెళ్లిన టీడీపీ అధినేత.. కారణం ఏంటంటే..?
ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణకు సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటుచేయనున్నారు. వారం రోజుల్లో చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహిస్తా అన్నారు. గ్రామ స్థాయి నుండి అనుబంధ సంఘాల ఏర్పాటుకు అన్ని కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యలపై విస్తృత పోరాటం చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో ఉన్న సమస్యలపై రెండు కమిటీల ఏర్పాటు చేయనున్నారు. పార్టీ నిర్మాణం పై దృష్టి సారించామని నర్సిరెడ్డి తెలిపారు.