చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి నాలుగు లైన్ల జాతీయ రహదారి చెంతనే శుక్ర, శనివారాల్లో ఈ మహానాడును అద్భుతంగా చేపట్డనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం ప్రాణాలు తీసే వ్యక్తి అంటూ చంద్రబాబుపై భరత్ మండిపడ్డారు. రాజమండ్రిని సర్వం సుందరంగా తీర్చిదిద్దితే టీడీపీ నాయకులు మహానాడు పేరుతో నాశనం చేస్తున్నారు. రోడ్డంతా కన్నాలు పెడుతున్నారని ఎంపీ భరత్ వీడియోను చూపించారు.
Nara Lokesh Comments On Mahanadu : టీడీపీలో ఇటీవల ఓ ట్రెండ్ మొదలైంది. సంచలన విషయాలను త్వరలోనే బయటపెడతామని చెబుతారు నాయకులు. ఆ తర్వాత అంతా గప్‌చుప్. ఉలుకు ఉండదు.. పలుకు ఉండదు. ఆ స్టేట్‌మెంట్స్ ఎందుకిస్తారో.. ఏంటో వాళ్లకే తెలియాలన్నది తమ్ముళ్ల మాట. ఇంతకీ ఇది వ్యూహమా? లేక ఇంకేదైనా ఉందా? ఎవరా నాయకులు? లెట్స్ వాచ్..! ఏదైనా ఓ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్నో.. ప్రభుత్వంలోని పెద్దలనో టార్గెట్ చేసే క్రమంలో విపక్షాలు…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు జిల్లాల పర్యటన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పలు జిల్లాలలో మినీ మహానాడు కార్యక్రమాలను నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగనున్న తొలి మహానాడుతో చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్ విధ్వంసకర పాలనను ఎండగడుతూ ప్రజల భవిష్యత్‌కు భరోసా…
తెలుగుదేశం పార్టీలో కొత్తరక్తాన్ని నింపి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రబాబు, నారా లోకేష్‌లు మహానాడు వేదికగా చెప్పుకొచ్చారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఆ మాటలు ఎంతవరకు వర్తిస్తాయనేది ప్రస్తుతం తమ్ముళ్ల ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారు? మాజీ ఎంపీ మాగంటి బాబు విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో అతికష్టం మీద టికెట్ సంపాదించి గెలిచారు మాగంటి బాబు. 2019 ఎన్నికల్లో…
గత నెల 19న ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగింది. 23న పోలీసులు అనంతబాబును అదుపులోకి తీసుకున్నారు. అయితే మధ్యలో నాలుగు రోజులు ఆ సమస్యను హైలైట్ చేయడానికి టీడీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర స్థాయిలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది కూడా. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ ఘటనపై టీడీపీకే చెందిన జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా ఎక్కడా పెదవి విప్పింది లేదు. అనంతబాబుకు జ్యోతుల నెహ్రూ, వరుపుల…
టీడీపీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి రాజీనామా అంశంలో పార్టీలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఆమె మూడు నాలుగేళ్ల క్రితమే పసుపు కండువా కప్పుకొన్నా.. దివ్యవాణికి ఉన్న సినీ గ్లామరుతో పార్టీలో.. ప్రజల్లో ఇమేజ్ సంపాదించారు. ఆమెకు టీడీపీ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీపైనా.. మంత్రులపైనా ఘాటైన విమర్శలు చేశారు దివ్యవాణి. అయితే మహానాడులో దివ్యవాణికి మాట్లాడే అవకాశం దక్కలేదు. దీంతో ఆమె అలకబూనారు. కావాలనే తనను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ చేశారు.…