ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న టీడీపీ మహానాడు వేదిక మారినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. తొలుత ఒంగోలు శివారులోని త్రోవగుంట బృందావన్ గార్డెన్ వెనుక వైపు ఖాళీ స్థలంలో మహానాడు నిర్వహించాలని టీడీపీ భావించింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంతంలో నీళ్లు నిలిచి బురదమయంగా తయారైంది. మరోసారి వర్షం పడితే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మహానాడు వేదికగా మార్చినట్లు టీడీపీ నేతలు వివరించారు.
Minister Peddireddy: ఇల్లు కట్టినా, బంగారం నాణేలు పంచినా బాబు గెలవడు..!
ఈ నేపథ్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో మహానాడు నిర్వహించాలని తలపెట్టగా విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం నడుస్తున్న కారణంగా మినీ స్టేడియం ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నేతలు ప్రత్యామ్నాయంగా ఒంగోలుకు 15 కి.మీ. దూరంలో గల మద్దిపాడు మండలం గుండ్లాపల్లిలోని మహీ ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మహానాడు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబుకు చెప్పగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా విశాలంగా ఉండే ఈ ప్రాంగణంలో దాదాపు 30వేల మంది పడతారని టీడీపీ నేతలు తెలిపారు. ఈనెల 20 నుంచి మహానాడు పనులు చేపడతామని పేర్కొన్నారు.