అమెరికాలోని బోస్టన్‌లో టీడీపీ మహానాడు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే. ఈ నేపథ్యంలో అమెరికాలోని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహంపై హెలికాప్టర్ నుంచి టీడీపీ అభిమానులు పూలవర్షం కురిపించారు. టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ విషయాన్ని తెలుపుతూ వీడియో పోస్ట్ చేశారు. ఈ మహానాడులో ఆయన కూడా పాల్గొన్నారు.
‘అమెరికాలోని బోస్టన్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మహానాడు సంబరాల్లో, హెలికాప్టర్లో అన్న గారి విగ్రహం మీద పూలు చల్లుతూ భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది’ అని గోరంట్ల తెలిపారు.
ఈ సంబరాల్లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి శాసనమండలి సభ్యుడు మంతెన సత్యనారాయణ రాజు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి, గౌతు శిరీష, మన్నవ సుబ్బారావు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నన్నూరి నర్సి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు, గౌతు శిరీష గారు,మన్నవ సుబ్బారావు గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నన్నూరి నర్సి రెడ్డి గారు ముఖ్య అతిధులుగా పాల్గొనడం జరిగింది.#GBC_Office pic.twitter.com/JHZUfC0A6j
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) May 22, 2022