ప్రకాశం జిల్లాలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు నేతలు. ఇప్పటి వరకు నాలుగు తీర్మానాలను మహానాడులో ప్రవేశపెట్టారు నేతలు. కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడు, సంక్షేమ పథకాల్లో మోసం, కష్టాల కడలిలో సేద్యం అంశాలపై తీర్మానాలకు మహానాడు ఆమోదం తెలిపింది. కష్టాలల కడలిలో సేద్యం.. దగాపడుతున్న రైతన్న అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ధూళిపాళ నరేంద్ర. వైసీపీ పాలనలో రాష్ట్ర రైతాంగ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర.…
టీడీపీ మహానాడు వేదికపై వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ చేపడుతున్న బస్సు యాత్రలో వస్తోంది మంత్రులు కాదని.. అలీబాబా 40 దొంగలు అని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ మంత్రులను ప్రజలు నిలదీయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారం అని తెలిపారు. ఇబ్బంది పెట్టిన వారిని కార్యకర్తలతోనే శిక్షలు విధించేలా న్యాయబద్దమైన, చట్టబద్దమైన అధికారాలు…
టీడీపీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఏపీలో ఉన్మాది పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. చేతకాని పాలన వల్ల ఏపీ పరువుపోయిందన్నారు. అటు మూడేళ్లుగా తమ నేతలను, కార్యకర్తలను ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతోమంది టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే తాను నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. అనవసరంగా ఉన్మాది చేతిలో బలికావొద్దని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. ఏపీలో పోలీసుల్లో మార్పు రావాలని… వాళ్ల లాఠీదెబ్బలకు ఇక్కడ ఎవరూ భయపడరని చంద్రబాబు హెచ్చరించారు.…
ఒంగోలు సమీపంలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండు రోజుల పాటు మహానాడు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మహానాడు కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం టీడీపీ భారీ ఫుడ్ మెనూ సిద్ధం చేసింది. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పర్యవేక్షణలో ఆహార కమిటీ రుచికరమైన వంటకాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వెయ్యి మంది నిష్ణాతులైన వారు మహానాడు ప్రాంగణంలో వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 11 ఫుడ్ కోర్టులు ఏర్పాటు…
ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం వద్ద టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడేళ్ల తర్వాత టీడీపీ మహానాడు జరుగుతోంది. ఈ మేరకు ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల నమోదుతో మహానాడును అట్టహాసంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఉదయం 10:15 గంటలకు వేదికపై మహానాడు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పార్టీ జెండా ఆవిష్కరించారు. కాగా మహానాడు…
టీడీపీ మహానాడు సందర్భంగా ఒంగోలులో శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ వెల్లడించారు. ప్రజలందరూ ట్రాఫిక్ ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు. మహానాడు కార్యక్రమానికి వెళ్లే వాహనాల మార్గాలు: ★ గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుంచి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట ఫ్లై ఓవర్ ఎక్కకుండా బై లైన్/సర్వీస్ రోడ్‌లో ఎంటర్ అయ్యి కిమ్స్ అండర్ పాస్ ద్వారా విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదగా…
శుక్రవారం నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. ఒంగోలు సమీపంలో జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ సర్వం సిద్ధం చేసింది. మహానాడులో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు ఒంగోలు బాట పట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 10 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మహానాడులో పాల్గొనేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఒంగోలు చేరుకున్నారు. మంగళగిరి నుంచి ఆయన…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఒంగోలు వెళ్లనున్నారు.. మూడు రోజుల పాటు అక్కడే బసచేయనున్నారు.. ఇవాళ ఒంగోలు వెళ్లనున్న ఆయన.. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొననున్నారు.. ఇక, చంద్రబాబు పర్యటన సందర్భంగా… విజయవాడ నుండి ఒంగోలు వరకు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధం అయ్యాయి టీడీపీ శ్రేణులు… ఆ బైక్ ర్యాలీకి ఉమ్మడి ప్రకాశం జిల్లా సరిహద్దు మార్టూరు నుండే స్వాగత ఏర్పాట్లు చేశాయి టీడీపీ శ్రేణులు.. మధ్యాహ్నం వరకు చంద్రబాబు ఒంగోలు చేరుకోనుండగా..…
ఒంగోలు సమీపంలో టీడీపీ ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం మహానాడు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తుంటే వైసీపీకి కడుపు మంటగా ఉందని సోమిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక గడపగడపకు వెళితే జనం మొహం మీద కొడుతున్నారని ఎద్దేవా చేశారు. MLA…