ఒంగోలులో నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ సాధించిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా మహానాడుకు తరలివచ్చారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మాత్రం వ్యతిరేకత ఉందో మహానాడుతో తేలిపోయిందని అచ్చె్న్నాయుడు పేర్కొన్నారు. మహానాడును విజయవంతం చేసిన వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. మహానాడు నిర్వహణకు స్థలం ఇచ్చి సహకరించిన మండువవారిపాలెం రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఒంగోలు సమీపంలో…
ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదు.ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలి వచ్చారు.మనకు జనాలు ఉన్నారు.. వారికి బస్సులున్నాయి.అధికారం పోతే ఆ బస్సులు కూడా వైసీపీకి ఉండవు. మహానాడును అడ్డుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు. మహానాడు వాహానాలకు గాలి తీసేస్తున్నారు.ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.జగనుకు ఈ రోజు పిచ్చెక్కుతుంది.జగనుకు ఇవాళ నిద్ర పట్టదు. వైసీపీ నేతలు వెల వెల.. టీడీపీ మీటింగులు కళ కళ.భవిష్యత్తులో ఎన్టీఆర్ రికార్డులను ఎవ్వరూ…
టీడీపీ నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. మహానాడు ఒక మహా స్మశానం. ఎన్టీఆర్ బతికి ఉంటే ఇవాళ వందో పుట్టినరోజు చేసుకుని ఉండేవారు. 73 ఏళ్ళ వయసులోనే ఆయనను హత్య చేసి ఇవాళ మహానాడు చేస్తున్నారు. ఆయన ఆత్మక్షోభ ప్రభావాన్ని చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి. పప్పునాయుడు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని పదవి దించే పరిస్థితి ఉంటుందా? మంత్రులు పార్టీకి రిపోర్ట్ చేస్తారు అన్నాడంటే చంద్రబాబు అవగాహన లేని నాయకుడు అని…
మహానాడు రెండో రోజున భారీ బహిరంగ సభ జరగనుంది. వివిధ జిల్లాల నుంచి బహిరంగ సభకు తరలి వస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని టీడీపీ అంచనా వేసింది. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి కార్లు, ట్రాక్టర్లు, వివిధ వాహనాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు వస్తుండడంతో ఒంగోలుకి వచ్చే దారులన్నీ పసుపుమయంగా మారాయి.
నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు శతిజయంతి వేడుకులను పురస్కరించుకొని టీడీపీ అధినేత ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనం మన వెంట ఉంటే జనం లేని బస్సులు వైసీపీ వైపు ఉన్నాయంటూ ఆయన విమర్శించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు జాతి వెలుగు ఎన్టీఆర్. తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్. ఎంతమంది పుట్టినా ఎన్టీఆర్ ఎన్టీఆరే అంటూ ఆయన కొనియాడారు.…
ప్రకాశం జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడు 2022 కి భారీ ఎత్తున తరలివచ్చారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఈ సందర్భంగా టీడీపీ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. పొత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండానే మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టడం విశేషం. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్దంగా ఉండాలంటూ రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పక్కా వ్యూహాలతో వెళ్లాల్సిన అవసరం ఉందంటూ రాజకీయ తీర్మానంలో…
టీడీపీ మహానాడుకి జనం పోటెత్తారు. ప్రకాశం వేదికగా సైకిల్ పార్టీ గుబాళించింది. మహానాడు2022 సందర్భంగా నారా లోకేష్ మీడియాతో ముచ్చటించారు. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు.. ప్రజలను హింసించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడరునే హింసిస్తోందన్నారు. ఓ ఎమ్మెల్సీ తన డ్రైవర్, పార్టీ కార్యకర్తనే చంపేస్తే.. మరో ఎమ్మెల్యే తన పార్టీ గ్రామ స్థాయి నేతను హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.…
తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు సంతకం తెలుగుదేశం పార్టీ అనేవారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఢిల్లీ వీధుల్లో తెలుగువారి కీర్తిపతాకను సగర్వంగా ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తీవ్ వత్తిడిలో వుంది. 40 ఏళ్ళ పండుగను గర్వంగా జరుపుకుంటున్నామని చెబుతున్నా. భవిష్యత్ సవాళ్ళు టీడీపీ నేతల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండురోజుల మహానాడు జరుగుతోంది. రాబోయే కాలం అంతా టీడీపీ నేతలకు పరీక్షా కాలమే అని చెప్పాలి. టీడీపీలో సంస్ధాగతంగా…
రాజకీయాల్లో ఎంత బిజీగా వున్న కీలక నేతల విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చాలా అలర్ట్ గా వుంటారు. కేంద్రమంత్రులు, ఇతర వీఐపీల జన్మదినోత్సవాలకు విధిగా శుభాకాంక్షలు తెలపడం ఆయనకు అలవాటు. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పుట్టినరోజు ఇవాళ. ఆయనకు శుభాకాంక్షలు అందచేశారు చంద్రబాబు. అదేం పెద్ద వార్తా అని కామెంట్ చేయవద్దు, టీడీపీ పండుగ మహానాడు ఇవాళ, రేపు వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ మహానాడు వేడుకల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి…