మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం సమీపంలో గూడ్స్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ ల మధ్య విజయవాడ నుంచి కాజీపేటకు వస్తున్న గూడ్స్ రైలు లింక్ తెగిపోవడంతో.. గూడ్స్ గార్డ్ బోగీతో పాటు మరో బోగీని ఇంజిన్ వదిలి వెళ్లిపోయింది.
కాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పేందు సీఎం కేసీఆర్ ఇవాల నాలుగు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రైతులకు అంండగా వుండి ప్రభుత్వం పరిహారం ఇస్తుందని అధైర్య పడకూదని సీఎం కేసీఆర్ రైతులతో స్వయంగా మాట్లాడుతూ ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించారు.
సీఎం కేసీఆర్ నేడు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వానతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలో పాదయాత్ర చేస్తున్నారు. సంఘిన సంక్షేమ గురుకుల పాఠశాలకు వెళ్లింది. ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ అమలులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొందరు వ్యక్తులు చెప్పులు విసిరేందుకు ప్రయత్నం చేయడంతో తీవ్ర కలకలం రేపింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయనపై కొందరు అధికార పార్టీ నాయకులు ఆయనపై చెప్పులు విసిరేయత్నం చేయగా అక్కడే వున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. వారిద్దరు అధికార పార్టీకి చెందిన వారికిగా గుర్తించినట్లు సమచారం.
బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబైంది. నగరం మొత్తం గులాబీ రంగులోకి మారింది. అయితే సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల బీఆర్ఎస్ జెండాలు, హోర్డింగ్‌లు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి.