CM KCR: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పేందు సీఎం కేసీఆర్ ఇవాల నాలుగు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రైతులకు అంండగా వుండి ప్రభుత్వం పరిహారం ఇస్తుందని అధైర్య పడకూదని సీఎం కేసీఆర్ రైతులతో స్వయంగా మాట్లాడుతూ ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. నష్టపరిహారం ఎకరానికి 10 వేల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను సీఎం కేసీఆర్ పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సహాయాన్ని తక్షణమే రైతులకు అందజేస్తామని స్పష్టం చేశారు. నిజానికి రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని, సహాయ పునరావాస చర్యలు అని అంటారని చెప్పారు.
Read also: Gutha Sukender Reddy: చైర్మన్ జనార్దన్ రెడ్డి హానెస్ట్ పర్సన్
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్, ఉచిత నీళ్లు, వాటర్ సెస్ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకుంటే వ్యవసాయం బాగుపడుతుందని అన్నారు. కావున ఆ స్థితిని దెబ్బతీయనివ్వకూడదు కాబట్టి ఈ రంగాన్ని నిర్వీర్యం కానివ్వమన్నారు సీఎం. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరూ ఇయ్యలేరని, రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. అందువల్లే ఎకరానికి 10వేలు ఇండియాలో తొలిసారిగా ప్రకటిస్తున్నానని సీఎం అన్నారు. దీనిని వెంటనే అందజేస్తామని, స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకుంటామన్నారు. ఇలా ఇచ్చే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా వాళ్లను పిలిపించి కౌలు రైతులను కూడా ఆదుకునేలా ఆదేశాలిస్తామన్నారు. ఇక..ఎట్టి పరిస్థితుల్లో నిరాశపడొద్దని, జరిగిన నష్టానికి ఏ మాత్రం చింతించకుండా రైతులు భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో ముందుకు పోవాలన్నారు. రైతులు ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొద్దని రైతన్నలకు భరోసా నింపారు సీఎం కేసీఆర్.
Salary Hike Time: వేతనాలు పెరిగే వేళాయెరా. అయితే.. ఈ టైంలో సంస్థలు ఏం ఆలోచిస్తాయంటే?