Lokamanya Tilak Express: ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. గత నెల 2వ తేదిన ఒడిషాలో జరిగిన రైలు ప్రమాదం అనంతరం రైలు ఎక్కాలంటేనే జనం భయపడుతున్న పరిస్థితి. వేరే గత్యంతరం లేక సామాన్య ప్రజానీకం రైళ్లనే ఆశ్రయించాల్సి వస్తుంది. అయితే ఏదో ఒక ప్రాంతంలో. ఏదో ఒక రకంగా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రైలు ప్రమాదాలు జరిగినప్పటికీ మరణాలు సంభవించడంలేదు. ఎక్కువ మొత్తంలో ప్రజలకు గాయాలు కూడా కావడం లేదు. ఈ రోజు లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిందంటే పెద్ద ప్రమాదం కాదు.. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ శివారు తాళ్లపూసపెళ్లి సమీపంలో 431/1 మైలురాయి వద్ద రైలు పట్టాలపై ఉన్న గేదెను రైలు ఢీకొన్నది. దీంతో రైలు అక్కడే ఆగిపోయింది.
Read also: Pawan Kalyan: తొలిప్రేమ చూస్తూ అభిమానుల అత్యుత్సాహం… థియేటర్ ధ్వంసం
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ శివారు తాళ్ల పూస పెళ్లి సమీపంలో 431/1 మైలురాయి వద్ద రైలు పట్టా పై గేదె ను లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొన్నది. రైలు విశాఖపట్నం నుండి ముంబై వెళ్తుండగా ఆ సంఘటన జరిగింది. ఎయిర్ బ్లాక్‌తో రైలు నిలిచిపోయింది. ప్రస్తుతం రైల్వే సిబ్బంది మరమ్మత్తు పనులను కొనసాగిస్తున్నారు.
లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలపై నిలిచిపోవడంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లోనే కోణార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. 55 నిమిషాలు నుంచి రైల్వే సిబ్బంది మరమ్మత్తు పనులను కొనసాగిస్తున్నారు.