డబ్బుల కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతున్న రోజులవి. మహబూబాబాద్ జిల్లాలో ఓ సుపారీ ముఠా హల్ చల్ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కు యత్నించిన ఆ ముఠా సభ్యులు అడ్డంగా బుక్కయ్యారు.. వారిని పట్టుకొని చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ సంఘటన మహబాబూబాద్ లోని సాలార్ తండా వద్ద జరిగింది. రాకేశ్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కారులో సాలార్ తండా కు బయలుదేరి వెళ్లాడు.…
అతనో తహశీల్దార్..అయితేనేం డ్యాన్సర్ లకు ధీటుగా డ్యాన్స్ వేస్తూ అలరించారు. నూతన సంవత్సరం వేడుకల్లో రచ్చరంబోలా చేశారు. చిరంజీవి స్టెప్పులతో డ్యాన్స్ తో గోలీమార్ అంటూ అందరినీ అలరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాహశీల్దార్. ఖమ్మం జిల్లా కల్లూరు మండల రెవెన్యూ అధికారిగా మంగీలాల్ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రెవిన్యూ పరిధిలో పనులతో బిజీగా గడిపే తహశీల్దార్ నూతన సంవత్సర వేడుకల్లో తనదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. మంగీలాల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా లోని…
ప్రేమించుకున్నారు. పెళ్ళిచేసుకోవాలని భావించారు. అయితే ఆ ఇద్దరిని తల్లిదండ్రులు విడదీశారు. ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో ఎంగేజ్మెంట్ చేశారు. కానీ వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. పెళ్ళిచేసుకోవడానికి వీలు లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో వారిని రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన ఓ ప్రేమ జంట గత మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. కాట్రపల్లి గ్రామానికి…
ఓ ప్రయివేటు ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఓ నవజాత శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యునిపై చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజుల తండా కు చెందిన నిండు గర్భిణీని ప్రసూతి నిమిత్తం తొలుత జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో…
వరంగల్ నగరంలో భ్రూణ హత్యలు నిత్యకృత్యంగా మారాయి. అబార్షన్లను అరికట్టడంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది విఫలం కావడంతో. చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బందికి ఫోన్ చేస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రైవేట్ హాస్పిటల్ తో ఉన్న కనెక్షన్లతో అక్రమ అబార్షన్ పై ఫిర్యాదులు ఉన్న పెద్దగా జిల్లా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిగిన సంఘటన నిదర్శనంగా చెబుతున్నారు. ఆడ, మగ తెలిపే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం…
కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎవరినీ వదలడం లేదు. మాజీ సైనికుడు క్యాన్సర్ చికిత్స కోసం దాచుకున్న డబ్బులను సైబర్ నేరస్థులు కొట్టేశారు.చెక్ బుక్ కోసం టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన తీరును క్యాష్ చేసుకున్న సైబర్ నేరస్థులు చికిత్స కోసం మూడు బ్యాంక్ ల్లో దాచుకున్న 2 లక్షల 30 వేల రూపాయలను దోచేశారు. ఇక్కడ భార్యతో సహా కనిపిస్తున్న ఈయన పెద్దబోయిన భిక్షపతి. మాజీ సైనికుడు దేశ సేవకోసం బార్డర్‌లో సేవలందించారు. విజయవంతంగా సేవలు…
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ కేసులో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష పడింది.. దీంతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు.. కాగా, మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. దానిపై విచారణ జరిపిన హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో… ఎంపీ కవిత 10 వేల రూపాయలు జరిమానా చెల్లించారు.. అలాగే…
ఓ వృద్ధుడు కష్టపడి సంపాదించినా సొమ్మును ఎలుకలు కొరికాయి. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా వేంనూరు శివారులోని ఇందిరానగర్ కాలనీతండాలో ఈ ఘటన చోటుచేసుకొంది. కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగించే భూక్య రెడ్యా.. గత నాలుగు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపులో కణతి కాగా.. దానిని శస్త్రచికిత్స చేసి తొలగించేందుకు రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. కూరగాయల వ్యాపారం చేసే రెడ్యా.. ఓవైపు బాధను భరిస్తూనే కూరగాయలు అమ్ముతూ డబ్బులు కూడబెడుతూ…
ఇళ్లలో పేపర్లు కనిపిస్తే చాలు ఎలుకలు నుజ్జు నుజ్జు చేసిన ఘటనలు ఎన్నో చూసి ఉంటారు.. కానీ, ఓ వృద్ధుడు తన ఆపరేషన్ కోసం కష్టపడి సంపాదించి కొంత… అప్పు తెచ్చి మరికొంత.. ఇంట్లో దాచుకున్నాడు.. కానీ, ఆ మొత్తం సొమ్మును ఎలుకలు నుజ్జు..నుజ్జు చేయడంతో లబోదిబోమనడం బాధితిడి వంతు అయ్యింది… మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం వేంనూర్ శివారు ఇందిరానగర్ తండాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇందిరానగర్ తండాకు చెందిన…
మహబూబాబాద్ జిల్లా జిల్లాలో ఇప్పటికే మైనర్ బాలికను అత్యాచారం… హత్య చేసిన ఘటన 24 గంటలు గడవకముందే…. మరో మైనర్ బాలికను గర్భవతిని చేసి మోసం చేసిన సంఘటన జిల్లాలో వెలుగు చూసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు బాబు నాయక్ తండాలో ఓ మైనర్ బాలికను… అదే తండాకు చెందిన భూక్యా.అమృతం అలియాస్ దాదా అనే యువకుడు 4 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు.బాలిక పెళ్లిచేసుకోవాలని నిలదీయడంతో పెద్దమనుషుల ముందు…