నిత్యం ఏదో ఒక అంశంపై వార్తల్లో నిలిచే వ్యక్తి మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తమ ప్రాంతానికి వచ్చే వలస పక్షులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ పైనా తాను జస్ట్ కేవలం ప్రజల వైపు చుస్తే చాలు అడ్డుకున్నారు.. అదే తాను సైగ చేస్తే సినిమా వేరేలా ఉండేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. వలస పక్షుల్లారా కబడ్ధార్ ఎవ్వరైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతే నాలుక కోసేస్తానంటూ శంకర్ నాయక్ అన్నారు.
Also Read : Lyricist Chandrabose : ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబోస్
వలస పక్షుల్లారా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. శంకర్ నాయక్ ను తిడితే మిమ్ములను తిట్టినట్లు కాదా అని ప్రజలు భావించారు. నేను జస్ట్ ప్రజల వైపైనా చూసిన ఆ చూపుతోటే ఇంత కదిలిక వచ్చిందని.. ఇంకా సైగ చేస్తే సినిమా ఎట్లా ఉండే దో గుర్తు పెట్టుకోవాలని శంకర్ నాయక్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది.
Also Read : Amritpal Singh: మహిళలతో అక్రమ సంబంధాలు.. పాక్ నుంచి ఆయుధాలు.. అమృత్‌పాల్ లీలలు..
ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ నాయకులు.. పార్టీ కార్యకర్తలు.. మంత్రి సత్యవరి రాథోడ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ సీఎం కేసీఆర్ ఇమేజ్ నీ చూసి భయపెడుతున్నదని.. దేశంలో అవినీతి నిర్మూలన సంస్థలు బీజేపీ నాయకుల అహంకారానికి భ్రష్టు పట్టిపోతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిఇంటికి పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తున్నారని ఆమె తెలిపారు.