ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా నేటితో ముగియనున్నది. జనవరి 13 (పౌష్ పూర్ణిమ)న ప్రారంభమైన కుంభమేళా నేడు మహాశివరాత్రితో(ఫిబ్రవరి 26) ముగియనున్నది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, దిగ్గజ వ్యాపారస్తులు, కుంభమేళాకు హాజరయ్యారు. దాదాపు 62 కోట్లకు పైగా భక్తులు…
Jharkhand: శివరాత్రి పర్వదినం రోజు జార్ఖండ్ హజారీబాగ్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. హజారీబాగ్‌లోని డమ్రౌన్ గ్రామంలో శివరాత్రి డెకరేషన్‌పై ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. రాళ్ల దాడి చేయడంతో పాటు, పలు వాహనాలు, షాపులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి, శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించేందుకు భారీగా పోలీసులు మోహరించారు.
Konda Surekha : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శైవక్షేత్రాల్లో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రముఖ శివక్షేత్రాల్లో భద్రతా చర్యలు, వసతుల కల్పన, ప్రాంగణ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా…
Masa Sivaratri: మాసశివరాత్రి శుభవేళ ఈ స్తోత్రాలు వింటే అన్ని బాధలు, అన్ని భారాలు తక్షణమే తొలగిపోతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
మహా శివరాత్రి, షబ్- ఈ -మేరజ్ (జగ్‌నే కి రాత్) సందర్భంగా నేడు (శనివారం) రాత్రి 10 గంటల తర్వాత ఇవాల, రేపు (18/19 తేదీ) నగరంలోని నెక్లెస్ రోడ్డుతో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భోళా శంకరుడిని దర్శనానికి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తూ శంభో శంకరా భోళ శంకరుడిని కీర్తిస్తూ శివుని కృపకు పాత్రులవుతున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.. ఫిబ్రవరి 22 నుండి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం స్వామి అమ్మవార్లకు విశేషపూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహనసేవలో భాగంగా సాయంకాలం స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ఇక, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో రేపటి (శనివారం) నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు శ్రీశైలం టెంపుల్ ఈవో లవన్న. Read Also: Ukraine Russia War: జెలెన్‌స్కీ హత్యకు మూడు కుట్రలు..! గర్భాలయ…
మహా శివరాత్రినాడు విషాదం నెలకొంది. పర్వదినం సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్ళి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్ సమీపంలోఈ సంఘటన జరిగింది. గల్లంతయిన యువకుడిని భూక్యా సాయి(20 )గా బంధువులు గుర్తించారు. అతని మృతదేహం లభించడంలో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కమలాపురం టీడీపీ కాలనీకి చెందిన భూక్య సాయి తమ బంధువులు, చట్టుప్రక్కల ఇళ్ళవారితో కలిసి మంగళవారం ఉదయం గోదావరి స్నానం చేయడం కోసం వెళ్ళారు. గోదావరిలో…