Flyovers Shutdown: రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని శైవాలయాలు, పరిసర ఆలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మహా శివరాత్రి, షబ్- ఈ -మేరజ్ (జగ్‌నే కి రాత్) సందర్భంగా నేడు (శనివారం) రాత్రి 10 గంటల తర్వాత ఇవాల, రేపు (18/19 తేదీ) నగరంలోని నెక్లెస్ రోడ్డుతో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్స్, PVNR ఎక్స్‌ప్రెస్‌వే, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్‌లకు మినహాయింపు ఉంటుంది. అయితే ఫ్లై ఓవర్ల నుంచి ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని, అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ (9010203626)ను సంప్రదించాలని సూచించారు. మార్పును గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.
Read also: SR Nagar Robbery: ఎస్‌ఆర్ నగర్ చోరీ కేసులో ట్విస్ట్.. ఆభరణాల దొంగ అతనే..
ఇవాళ హిందువులు పండుగ మహాశివరాత్రికి ఉపవాసం వుండి రాత్రి అంతా మేలుకుంటారు. అయితే నేడే ముస్లీంల పండుగ జగ్ నే కి రాత్ కూడా కావడంతో.. రాత్రంగా మేలుకుని నమాజ్ చెదువుకుని పవిత్ర ఖురాన్ ను పఠిస్తూ గడుపుతారు. అయితే మహాశివరాత్రి, జగ్‌నేకి రాత్ రెండు ఒకే రోజు రావడంతో.. ఎటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. శివ రాత్రి కావడంతో శైవ క్షేత్రాలకు వెళుతూ బయట హిందువులు తిరుగుతుంటారు. ఈవిధంగానే ముస్లీంలు కూడా రాత్రంతా మేలుకుని నమాజ్ లు చేసి బయటకు వస్తారు. దీంతో ఎటువంటి ఘటనలకు తావులేకుండా ముందుగా ఫ్లై ఓవర్ లను బంద్ చేయనున్నారు. రాత్రి 10 గంటలనుంచి ఈ నిబంధనలు అమలుకానున్నాయి. దీనికి నగర ప్రజలు అందరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.
Rajanna Temple: రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు.. చెరువు ప్రాంతంలో దిగేందుకు..