Konda Surekha : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శైవక్షేత్రాల్లో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రముఖ శివక్షేత్రాల్లో భద్రతా చర్యలు, వసతుల కల్పన, ప్రాంగణ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు క్షుణ్ణంగా చేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం, కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం, రామప్ప శివాలయం, మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం, చాయా సోమేశ్వర ఆలయం (పానగల్), పాలకుర్తి సోమేశ్వర దేవాలయం, వరంగల్ వెయ్యి స్థంభాల గుడి, మెట్టుగుట్ట దేవాలయం, కాశిబుగ్గ శివాలయం, భద్రకాళి ఆలయం తదితర ప్రఖ్యాత ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు
మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించి, ఈ పండుగ రోజున అనుసరించాల్సిన చర్యలను పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా:
ఎండోమెంట్స్ శాఖ ప్రత్యేక సమీక్ష
ఈ పండుగ రోజున రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో జరిగే కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు హైదరాబాద్‌లోని ఎండోమెంట్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే, సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులతో సమన్వయం
ప్రతి జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో మహా శివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రభుత్వ బాధ్యతగా ప్రతి భక్తుడూ శివరాత్రి పండుగను ఆనందంగా జరుపుకునేలా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
మహా శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉన్నందున, ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, భక్తులకు తగిన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని అమలు చేయాలని సూచించారు.
Bombay High Court: ‘‘ ఏ తల్లీ సొంత బిడ్డను కొట్టదు’’.. దాడి కేసులో మహిళకు బెయిల్..