CM Mohan Yadav: ప్రపంచ కాలానికి అత్యంత ముఖ్యమైనది 0 డిగ్రీల రేఖాంశం. దీనినే ‘ప్రైమ్ మెరిడియన్’గా పిలుస్తుంటాం. ఈ రేఖాంశం నుంచి భూమిని నిలువుగా రెండు వైపులు సమానంగా విభజిస్తోంది. ఈ రేఖాంశం ఇంగ్లాండ్ లోని గ్రీన్‌విచ్ అనే ప్రాంతం నుంచి వెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ అంశం దేశంలో, ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
సీఎం మోహన్ మాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ‘‘ఉజ్జయిని’’ నుంచి ప్రైమ్ మెరిడియన్ వెళ్తున్నట్లు చెబుతున్నారు. ప్రైమ్ మెరిడియన్ గ్రీన్‌విచ్ నుంచి వెళ్తుందని 1884లో ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ విధానాన్నే ఆమోదిస్తోంది. అయితే, “ఉజ్జయిని గ్లోబల్ ప్రైమ్ మెరిడియన్”, “ప్రపంచ కాలాన్ని సరిదిద్దడానికి” తాను కృషి చేస్తానని సీఎం యాదవ్ చెబుతున్నారు.
Read Also: Road Accident: నారాయణ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి
‘‘ ఇది మా ఉజ్జయిని సమయం, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. కానీ పారిస్ సమయాన్ని నిర్ణయించడం ప్రారంభించింది. గ్రీన్‌విచ్‌ని ప్రైమ్ మెరిడియన్‌గా భావించి బ్రిటిషర్లు దీనిని స్వీకరించారు’’ అని ఆయన గురువారం మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అన్నారు.
కొన్ని హిందూ పురాతన గ్రంథాల ప్రకారం.. సున్నా డిగ్రీల రేఖాంశం, కర్కాటక రేఖ పరస్పరం ఉజ్జయిని వద్ద ఖండించుకుంటాయని చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో దీనిక అధిక ప్రాముఖ్యత ఉంది. వరాహమిహిర, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్య వంటి ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఉజ్జయినిలో నివసించారని చెబుతారు. భారత్‌లోని పురాతన నగరాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని ఒకటి. 1720లో జైపూర్ మహారాజా సవాయ్ జై సింగ్-2 ఉజ్జయినిలో అబ్జర్వేటరీని నిర్మించారు.