Garlic: వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో.. రైతులు పంటని కాపాడుకోవడానికి రైతుల తిప్పలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garlic: వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ధరలు పెరిగాయి. దీంతో ఈ పంటను సాగు చేస్తున్న రైతులు తమ పంటను కాపాడుకునేందుకు అనేక ఏర్పాట్లను చేసుకుంటునున్నారు. గతంలో టమాటో ధరలు పెరిగిన సందర్భంలో దొంగలు పంటల్ని దోపిడి చేసిన ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వెల్లుల్లి రైతులు పంట దోపిడి కాకుండా వినూత్న చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా మధ్యప్రదేశ్ చింద్వారాలో వెల్లుల్లి రైతులు తమ పంటలకు రక్షణగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర కిలోకి రూ. 400 నుంచి రూ. 500కి చేరుకోవడంతో రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరోవైపు దొంగల భయం వెన్నాడుతోంది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
Read Also: Israeli flight: థాయ్‌లాండ్ నుంచి ఇజ్రాయిల్ వెళ్తున్న ఫ్లైట్ హైజాక్‌కి యత్నం..
13 ఎకరాల్లో వెల్లుల్లిని పండించడంలో రూ. 25 పెట్టుబడి పెట్టి వెల్లుల్లి సాగుదారు రాహుల్ దేశ్‌ముఖ్ ప్రస్తుతం ఆ పంటను అమ్మేసి దాదాపుగా రూ. 1 కోటి రాబడిని అందుకున్నాడు. సోలార్‌తో నడిచే కెమెరాలను పంటకు రక్షణగా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు అదే ప్రాంతమైన బద్నూర్‌లో పవన్ చౌదరి అనే ఓ రైతుల 4 ఎకరాల్లో వెల్లుల్లి పంటను సాగు చేసి రూ. 6 లక్షల లాభం పొందినట్లు వెల్లడించారు. అయితే, పంటను రక్షించుకునేందు పొలంలో మొత్తం 3 సీసీటీవీలను ఏర్పాటు చేశానని, పంటను దొంగిలిస్తుండటంతో ఈ పని చేయాల్సి వచ్చిందన్నారు.
సాధారణంగా కిలో వెల్లుల్లి ధర సాధారణంగా రూ. 80 వరకు ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో వెల్లుల్లి ధర ఏకంగా రూ.500 వరకు చేరుకుంది. దీంతో రైతులు తమ పంటకు ధర పెరిగిందని ఆనందిస్తున్నారు. మరోవైపు సామాన్యుడు వెల్లుల్లి కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో ధర పెరుగుదలను చూడలేదని రైతులు చెబుతున్నారు.
#WATCH | In the wake of surging prices of garlic in Madhya Pradesh's Chhindwara, farmers have now come up with innovative measures to protect the produce by installing CCTV cameras in their fields. pic.twitter.com/CwaJbEPsh3
— ANI (@ANI) February 18, 2024
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?