Kamal Nath: గతేడాది చివర్లో జరిగి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అన్ని తానై నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బీజేపీలోకి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఆయన ఈ రోజు సాయంత్రం బీజేపీ పెద్దలతో ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. మరోవైపు ఆయన కుమారుడు చింద్వారా కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ ఇప్పటికే తన సోషల్ మీడియా బయో నుంచి కాంగ్రెస్‌ని తొలగించారు. ఈ నేపథ్యంలో చేరిక లాంఛనమే అని తెలుస్తోంది.
Read Also: Australia: ప్రైవేట్ పార్ట్‌లోకి బ్యాటరీలు చొప్పించుకున్న వ్యక్తి.. ఆ తర్వాత ఏమైందంటే..?
ఇదిలా ఉంటే, కమల్ నాథ్‌కి కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ స్థానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ మంటలోనే ఆయన బీజేపీలోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ నాథ్ బీజేపీలో చేరే అవకాశం ఉంది, కాంగ్రెస్ నాయకత్వం అతడిని సంప్రదించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పార్టీ మారే విషయంపై కమల్ నాథ్ స్పందించారు. శనివారం మధ్యాహ్నం ఆయన దేశరాజధానికి చేరుకున్నారు. పార్టీ మారే విషయంపై మాట్లాడుతూ అలాంటిది ఏదైనా ఉంటే ముందుగా మీకు తెలియజేస్తానని విలేకరులతో అన్నారు.