రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. సన్ సిటీ వద్ద 270 గ్రాముల (MDMA) డ్రగ్స్ పట్టుకుని సీజ్ చేశారు. ఓ యువకుడి తో పాటు మహిళను అరెస్ట్ చేశారు. సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
దేశంలోనే ఆధునిక రైలు వందే భారత్కు మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ మొరెనా స్టేషన్ సమీపంలో రైలులో పెద్ద పేలుడు సంభవించింది. రైలు ఆగిపోయింది. పేలుడు సంభవించిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో ఆగ్రా- ముంబై జాతీయ రహదారిపై షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ బైక్ పై వెళ్తున్న ముగ్గురు దొంగలు కదులుతున్న ట్రక్కు నుంచి చోరీ చేశారు.
Man Kills Mother: మధ్యప్రదేశ్లో దారుణం జరగింది. కనిపెంచిన తల్లిని అత్యంత కిరాతకంగా హతమర్చాడు కన్నకొడుకు. తనకు రాత్రి భోజనం పెట్టలేదనే కోపంతో రాష్ట్రంలోని రత్నా జిల్లాలో కసాయ కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
అతి వేగం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ఓ కారు ముందు నిలిపి ఉన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి 11 గంటలకు ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకుంది.
ప్రస్తుతం దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయాని కంటే ముందే అండమాన్ - నికోబార్ను తాకబోతున్నాయి.
మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వాలో ఐదేళ్ల అమాయక బాలికపై అత్యాచారం జరిగిన జుగుప్సాకరమైన ఘటన చోటుచేసుకుంది. పొరుగున ఉంటున్న 17 ఏళ్ల మైనర్ ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి బాలికకు కడుపునొప్పి రావడంతో విషయం వెలుగులోకి వచ్చిందని బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉక్కపోత, వేడిగాలుల నుండి ప్రజలు త్వరలో ఉపశమనం పొందబోతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(IMD) ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
Madhyapradesh : జార్ఖండ్ తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఓ ఇంట్లో 'నోట్ల కొండ' బయటపడిన ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ నోట్లను స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందించారు.